ఓ భార్య కట్టుకున్న భర్త తన తండ్రితో కలిసి దారుణంగా హత్య చేసింది. ఆ తర్వాత గుండెపోటుతో మరణించాడని అందరినీ నమ్మించింది. అసలు విషయం వెలుగులోకి రావడంతో నోట్లోనీళ్లు నమిలింది. అసలు భర్తను ఎందుకు చంపిందంటే?
ఏపీలో దారుణం చోటు చేసుకుంది. ఓ భార్య తండ్రితో కలిసి ఏకంగా కట్టుకున్న భర్తనే దారుణంగా హత్య చేసింది. ఆ తర్వాత గుండెపోటుతో మరణించాడంటూ సరికొత్త డ్రామాకు తెర లేపింది. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే పోలీసుల విచారణలో మాత్రం భార్య చేసిన దారుణం వెలుగులోకి వచ్చింది. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. అసలు ఆ మహిళ తండ్రితో కలిసి భర్తను ఎందుకు చంపింది? అందుకు దారి తీసిన పరిస్థితులు ఏంటి? అసలేం జరిగిందంటే?
పోలీసుల కథనం ప్రకారం.. అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగుల మండలం నేరొడివలస గ్రామం. ఇక్కడే హరివిజయ్-ప్రీతి దంపతులు నివాసం ఉంటున్నారు. వీళ్లు 2014లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లైన కొంత కాలానికి వీరికి ఓ కూతురు జన్మించింది. ఆ తర్వాత ఈ దంపతులు ఇద్దరూ ఫైనాన్స్ వ్యాపారం చేశారు. అలా కొంత కాలం పాటు వీరి జీవితం సాఫీగానే కొనసాగింది. అయితే వ్యాపారంలోని డబ్బుల విషయంలో భార్యాభర్తలు తరుచు గొడవ పడేవారు. ఈ క్రమంలోనే భార్య ప్రీతి భర్తను చంపాలని ప్లాన్ వేసింది. ఇందు కోసం తన తండ్రి సాయం తీసుకుంది. అయితే ఏప్రిల్ 18న భర్త హరివిజయ్ కు అతిగా మద్యం తాగించారు. అతడు పూర్తిగా మత్తులోకి జారుకున్నాక ముఖంపై దిండిపెట్టి ఊపిరాడకుండా చేసి హత్య చేశారు.
ఆ తర్వాత భార్య ప్రీతి తనే స్వయంగా కారు నడుపుతూ భర్తను స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లింది. చనిపోయాడని వైద్యులు నిర్ధారించాక.. అతని మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చి గుండెపోటుతో మరణించాడని మొసలి కన్నీరు కార్చింది. ఎందుకో అనుమానం వచ్చిన హరివిజయ్ కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు భార్య కాల్ డేటా పరిశీలించారు. ఆ తర్వాత పోలీసుల విచారణలో ప్రీతి నేరాన్నిఅంగీకరించింది. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ప్రీతితో పాటు ఆమె తండ్రిని అరెస్ట్ చేసి పరారీలో ఉన్న మరో ఐదుగురికి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. డబ్బుల విషయంలో గొడవ పడి ఏకంగా తండ్రితో కలిసి భర్తను చంపిన ఈ కిరాతక భార్య దారుణంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.