ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో సంక్షేమ పథకాలను అమలులోకి తెచ్చారు. పేదవారికోసం అన్ని రంగాలలో అభివృద్ధి సాధించేందుకు కృషి చేస్తుంది. యువకులను కూడ ఆర్థికంగా ప్రోత్సహించేందుకు మరో పథకం ‘YSR లా నేస్తం’ ని తీసుకువచ్చింది. దీని ద్వారా నెలకు రూ. 5వేల స్టైఫండ్ ఏపీ ప్రభుత్వం యువ న్యాయవాదులకు అందిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో సంక్షేమ పథకాలను అమలులోకి తెచ్చారు. పేదవారికోసం అన్ని రంగాలలో అభివృద్ధి సాధించేందుకు కృషి చేస్తుంది. సంక్షేమ పథకాలను అన్ని వర్గాల వారికి అందేలా చూడడానికి వాలంటీర్లను కూడా నియమించడం జరిగింది. అటు రైతులకు.. ఇటు పేద ప్రజలకు ఆర్థికంగా సాయం అందిస్తుంది. యువకులను కూడ ఆర్థికంగా ప్రోత్సహించేందుకు మరో పథకం ‘YSR లా నేస్తం’ ని తీసుకువచ్చింది. దీని ద్వారా నెలకు రూ. 5వేల స్టైఫండ్ ఏపీ ప్రభుత్వం యువ న్యాయవాదులకు అందిస్తోంది. యువ న్యాయవాదులకు ఏపీ సర్కార్ శుభవార్త తెలిపింది. నేడు వైఎస్‌ఆర్ లా నేస్తం నిధులు విడుదల కానున్నాయి.
2023-24 సంవత్సరానికి తొలి విడతలో అర్హులైన యువ న్యాయవాదుల అకౌంట్లలో నగదు జమ కానున్నాయి. అర్హులైన వారు 2,677 మంది కాగా.. వారికి నెలకు రూ. 5వేల చొప్పున వారి ఖాతాలోకి రానున్నాయి. ఈ సంవత్సరం ఫిబ్రవరి నుంచి జూన్ వరకు అంటే 5నెలలకు ఒక్కొక్కరి అకౌంట్లలో రూ. 25 వేలు వేయనున్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయం నుంచి నేరుగా బటన్ నొక్కి యువ న్యాయవాదుల అకౌంట్‌లోకి జమ చేయనున్నారు. ఈ స్కీమ్ కింద మొత్తం రూ.6,12,65,000 యువ న్యాయవాదులకు ఆర్థిక ప్రోత్సాహకంగా ఇవ్వనున్నారు. లా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వారికి లాయర్ గా స్థిరపడేందుకు ఏడాదికి రెండు విడతల వారిగా నెలకు రూ. 5వేలు చెల్లించనున్నారు. మూడేళ్లపాటు రూ. 1.80 లక్షల సాయం అందుతున్నట్లు తెలుస్తోంది. ఏడాదికి రూ. 60 వేల ఆర్థిక సాయం వారికి అందుతోంది. నేడు విడుదల చేసే నిధులతో కలిపి.. 5,781 మంది యువ న్యాయవాదులకు సాయం అందుతున్నట్లు తెలుస్తుంది.
ఆంధ్రపదేశ్ నివాసి అయి ఉండాలి, న్యాయశాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి, 2016 సంవత్సరం తర్వాత లా గ్రాడ్యుయేట్ ఉత్తీర్ణులైన వారు అర్హులు, 1961లోని సెక్షన్ 17 ప్రకారం ఏపీ రాష్ట్ర బార్ కౌన్సిల్ నిర్వహించే న్యాయవాదుల రోల్స్‌లో పేరు నమోదు కావాలి, మొదటి మూడేళ్లు ప్రాక్టీస్‌ను చేస్తూ ఉండాలి, ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసే నాటికి జూనియర్ న్యాయవాది వయసు 35 ఏళ్లకు మించరాదు.
ప్రతి కుటుంబంలో ఒకరికే ఈ పథకం వర్తిస్తుంది. కుటుంబంలో భార్యాభర్తలు ఉంటే ఇద్దరిలో ఒకరికే వర్తిస్తుంది. మూడేళ్లు ప్రాక్టీస్ దాటిన జూనియర్ న్యాయవాదులు అర్హులు కారు, ఫోర్ వీలర్ వెహికిల్స్ ఉన్న వారు, ప్రాక్టీస్ చేయని న్యాయవాదులు అనర్హులు.