ఈ మద్య రైలు ప్రమాదాల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. కొన్ని మానవ తప్పిదాలు ఉంటే.. సాంకేతిక లోపాల కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇక వేసవి కాలంలో తరుచూ రైల్లో మంటలు వ్యాపిస్తున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి.
ఇటీవల దేశ వ్యాప్తంగా పలు చోట్ల రైలు ప్రమాదాలు జరుగుతున్న విషయం తెలిసిందే. కొన్ని మానవ తప్పిదాలు ఉంటే.. మరికొన్ని సాంకేతిక లోపాలు తలెత్తడం, షాట్ సర్క్యూల్ కావడం వల్ల మంటలు రావడం చూస్తున్నాం. ఇక వేసవి కాలంలో తరుచూ రైళ్లలో మంటలు రావడంతో ప్రమాదాలు జరుగుతున్న వార్తలు వస్తూనేఉన్నాయి. తాజాగా నెల్లూరు రాజధాని ఎక్స్ ప్రెస్ లో పొగలు రావడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
చెన్నై నుంచి ఢిల్లీ హజరత్ నిజాముద్దీన్ వెళ్తున్న రాజధాని ఎక్స్ ప్రెస్ లో పొగలు రావడంతో కలకలం రేగింది. కావలి రైల్వే స్టేషన్ బి-5 బోగీలో ఒక్కసారిగా మంటలు రావడం గుర్తించారు. దీంతో భయాందోళనకు గురైన ప్రయాణికులు వెంటనే రైలు దిగి పరుగులు పెట్టారు. అయితే రైల్వే సిబ్బంది, అధికారులు వెంటనే అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది. పొగలు రావడానికి గల కారణాలు గుర్తించిన రైల్వే సిబ్బంది.. మరమ్మతులు చేశారు. ఈ కారణంతోనే కావలి స్టేషన్ లో రాజధాని ఎక్స్ ప్రెస్ కొద్ది సేపు నిలిచిపోయింది. బ్రేకులు ఫెయిల్ కావడం వల్లనే ఈ ప్రమాదం జరిగినట్లుగా రైల్వే అధికారుల చెబుతున్నారు. మొత్తానికి ఈ ప్రమాదంలో ఎవరికీ ఏమీ కాకపోవడంతో రైల్వే అధికారులు, ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.
రాజధాని ఎక్స్ ప్రెస్ లో పొగలు pic.twitter.com/ArWrPkWtub
— Rajasekhar (@Rajasek61450452) April 9, 2023