టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర 73వ రోజుకి చేరుకుంది. 73వ రోజు పాదయాత్ర ఆలూరు నియోజకవర్గంలోని ఎం.కె కొట్టాల విడిది కేంద్రం నుంచి ప్రారంభమైంది. ప్రజలతో మమేకమవుతూ లోకేశ్.. తన పాదయాత్రను కొనసాగించారు.
తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర 73వ రోజుకి చేరుకుంది. 73వ రోజు పాదయాత్ర ఆలూరు నియోజకవర్గంలోని ఎం.కె కొట్టాల విడిది కేంద్రం నుంచి ప్రారంభమైంది. లోకేశ్ పాదయాత్రలో భాగంగా ప్రతిరోజు 1000 నుంచి 1500 మందితో సెల్ఫీ దిగే కార్యక్రమం ఉంటుంది. ఎం.కె కొట్టాల విడిది కేంద్రం వద్ద తనను కలిసేందుకు వచ్చిన యువతీయువకులతో లోకేశ్ ముచ్చటించారు. అలానే లోకేశ్ ప్రతీ రోజూ తనని కలవడానికి వచ్చిన ప్రజలను, కార్యకర్తలను, అభిమానులను ఆప్యాయంగా పలకరిస్తూ సెల్ఫీ ఇచ్చారు. లోకేశ్ ఓపికగా వచ్చిన అందరితో సెల్ఫీ ఇవ్వడం పట్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు.
టీడీపీ నాయకుడు, మాజీ మంత్రి నారా లోకేశ్ బాబు చేపట్టిన యువగళం పాదయాత్రకు విశేష స్పందన వస్తోంది. జనం పెద్ద సంఖ్యలో లోకేశ్ పాదయాత్రలో పాల్గొంటున్నారు. యువనేతకు ప్రజలు, అభిమానులు, టీడీపీ కార్యకర్తలు తమ మద్దతు తెలియజేస్తున్నారు. ఇప్పటి వరకు తిరుపతి, చిత్తూరు, అనంతపురం, పుటపర్తి జిల్లాలో లోకేశ్ తన పాదయాత్రను పూర్తి చేసుకున్నారు. ఇప్పటి వరకు లోకేశ్ 933 కి.మీ దూరం నడిచారు. ప్రస్తుతం లోకేశ్ పాదయాత్ర ఉమ్మడి కర్నూలు జిల్లాలో కొనసాగుతోంది. 73వ రోజు లోకేశ్ పాదయాత్ర ఆలూరు నియోజకవర్గంలోకి కొనసాగుతోంది.
73వ రోజు పాదయాత్రలో భాగంగా గుండ్లకొండ గ్రామస్థులతో లోకేశ్ భేటీ అయ్యారు. వారి చెప్పిన సమస్యలను ఎంతో ఒపికగా విన్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత వారి సమస్యలు పరిష్కరిస్తానంటూ హామి ఇచ్చారు. అలానే నేలతలమలి గ్రామస్తులు యువనేతను కలిసి తమ సమస్యను విన్నవించారు. గత ప్రభుత్వంలో తమ గ్రామానికి సీసీ రోడ్లు మంజూరయ్యాయని, వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఆ రోడ్లను రద్దు చేశారని వారు తెలిపారు. “జగన్ మోహన్ రెడ్డి గ్రామాలను దోచుకోవడం తప్ప పనులు చేపించింది లేదు. వైసీపీ పాలనలో గ్రామాల అభివృద్ధి పూర్తిగా కుంటుపడింది. మేం అధికారంలోకి వచ్చాక రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో సిసి రోడ్ల నిర్మిస్తాం. గ్రామాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తాం” అని లోకేశ్ హామి ఇచ్చారు.
కర్నూలు జిల్లా ఎపియుడబ్ల్యుజె సంఘ ప్రతినిధులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. వారి వినతి పత్రాలపై స్పందించిన లోకేశ్.. టిడిపి అధికారంలోకి వచ్చాక జర్నలిస్టుల సమస్యలపై సీనియర్ పాత్రికేయులతో కమిటీ వేసి సమస్యల పరిష్కారానికి కృషిచేస్తామని, జర్నలిస్టులకు గతంలో మాదిరిగా ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తామని తెలిపారు. ఇలా అన్ని వర్గాల ప్రజలను కలుస్తూ లోకేశ్ పాదయాత్ర సాగింది. మరి.. 73వ రోజు ఆలూరు నియోజకవర్గంలోని లోకేశ్ పాదయాత్రపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.