దేశంలో అత్యంత సంపన్న మహిళల జాబితాను విడుదల చేశారు. దీనిలో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ లిమిటెడ్ ఛైర్‌పర్సన్ రోష్ని నాడార్ మల్హోత్రా తొలి స్థానంలో నిలిచారు. ఈ జాబితాను కోటక్ ప్రైవేట్ బ్యాంకింగ్ – హురున్ వెల్లడించింది. 2021లో రూ.84,330 కోట్ల సంపదతో రోష్ని నాడార్‌కు భారత్‌లో అత్యంత సంపన్న మహిళ స్థానం దక్కింది. వరుసగా రెండో ఏడాది కూడా ఆమె ప్రథమ స్థానంలో నిలిచింది. ఇక ఈ జాబితాలో నాలుగో స్థానంలో తెలుగు ప్రాంతానికి చెందిన దివీస్ ల్యాబ్స్ కు చెందిన నీలిమ నిలిచారు. భారత్ లో పుట్టి లేదంటే పెరిగిన 100 మంది సంపన్న మహిళలతో ఈ జాబితాను సిద్ధం చేశారు. వీరి మొత్తం సంపద 2020లో రూ.2.72 లక్షల కోట్లు ఉంటే.. ఏడాదిలో అది కాస్తా రూ.4.16 లక్షల కోట్లుకు చేరటం గమనార్హం. ఇది భారత జీడీపీలో 2 శాతానికి సమానమని చెబుతున్నారు ఆర్థిక నిపుణులు.
ఇక ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి కూడా స్థానం సంపాదించుకున్నారు. భువనేశ్వరి రూ.480 కోట్లతో 77 స్థానంలో నిలిచారు. ఈ జాబితాలో ఢిల్లీకి చెందిన వారు 25 మంది, ముంబై నుంచి 21 మంది ఉండగా.. 12 మంది సంపన్న మహిళలతో హైదరాబాద్ మూడో స్థానంలో నిలిచింది. ఈ 12 మందిలో ఒకరు నారా భువనేశ్వరి కాగా.. మరో నలుగురు అపోలో హాస్పిటల్స్‌కు చెందిన వారే కావడం విశేషం. టాప్ 100 జాబితాలో నిలిచిన మహిళల సంపద ఏడాది వ్యవధిలో కనీసం రూ.100 కోట్ల నుంచి రూ.300కోట్లకు పెరగటం ఒక విశేషంగా చెప్పాలి. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
The richest women’s in the country 2021 pic.twitter.com/Ac2MHaHCBe
— Sekhar Rambo (@RamboSekhar) July 28, 2022