తల్లితో సహా ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి అదృశ్యమయ్యారు. ఎక్కడికైనా వెళ్లారా, లేదంటే ఎవరన్న వీరిని కిడ్నాప్ చేశారో, లేదంటే మనస్పర్థలు వచ్చి.. ఇంట్లో నుండి పిల్లలను తీసుకుని వెళ్లిపోయిందో తెలియ రావడం లేదు.
ఏం కష్టమొచ్చిందో తెలియదు, ఏ సమస్యలు వెంటాడుతున్నాయో తెలియదు కానీ ఓ తల్లి.. తన ముగ్గురు పిల్లలనున తీసుకుని ఇంటి నుండి వెళ్లిపోయింది. వాళ్లు ఏమయ్యారో అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. నాలుగు రోజుల నుండి వీరి జాడ కనిపించడం లేదు. తల్లితో సహా ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి అదృశ్యమయ్యారు. ఎక్కడికైనా వెళ్లారా, లేదంటే ఎవరన్న వీరిని కిడ్నాప్ చేశారో, లేదంటే మనస్పర్థలు వచ్చి.. ఇంట్లో నుండి పిల్లలను తీసుకుని వెళ్లిపోయిందో తెలియ రావడం లేదు. తల్లి, పిల్లలు మిస్ కావడం పలు అనుమానాలకు తావునిస్తుంది. కాగా, వీరి అదృశ్యంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ సత్యసాయి జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు కనిపించకుండా పోవడం కలకలం రేపింది. గుడిబండ మండలం ముదిగుబ్బ గ్రామంలో తిరుమల రాజు కుటుంబం జీవిస్తోంది. వీరికి ఇద్దరు కుమార్తెలు శ్రీలేఖ, సౌజన్య, ఓ కుమారుడు కార్తీక్ ఉన్నారు. ఏప్రిల్ 27న ముగ్గురు పిల్లలతో కలిసి తల్లి తనుశ్రీ ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. దీనిపై గుడిబండ పోలీస్ స్టేషన్‌లో భర్త తిరుమలరాజు ఫిర్యాదు చేశారు. తల్లి తనుశ్రీతో పాటు శ్రీలేఖ, సౌజన్య, కార్తీక్ అదృశ్యమైనట్లు కంప్లయింట్ ఇచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు ప్రారంభించారు.