ఈ మద్య దేశంలో ప్రతిరోజూ ఎక్కడో అక్కడ రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. కారణాలు ఏవైనా ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. మరికొంత మంది అంగవైకల్యంతో ఎన్నో అవస్థలు పడుతున్నారు. తాజాగా విశాఖపట్టణంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఉత్తరాంధ్ర చిరంజీవి అభిమానుల సంఘం కన్వీనర్ యడ్ల లక్ష్మణ్‌యాదవ్ దుర్మరణం పాలయ్యారు. వివరాల్లోకి వెళితే..
విశాఖపట్టణం మధురవాడకు చెందిన లక్ష్మణ్‌యాదవ్ ఆర్టీసీ డ్రైవర్ పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. గత కొంత కాలంగా జనసైనికుడిగా, ఉత్తరాంధ్ర చిరంజీవి అభిమానుల సంఘం కన్వీనర్‌గా పనిచేస్తున్నారు. తన బైక్ పై బయలు దేరిన లక్షణ్ యాదవ్ ని నగరంలోని జాతీయ రహదారిపై కొమ్మాది కూడలి వద్ద వెనకనుంచి వేగంగా వచ్చిన లారీ బలంగా ఆయన బైక్‌ను ఢీకొట్టింది. రోడ్డుపై ఎగిరిపడిన ఆయన తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందారు.
మృతి చెందిన లక్ష్మణ్ యాదవ్‌కు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఉత్తరాంధ్ర చిరంజీవి అభిమానుల సంఘం కన్వీనర్‌గా లక్షణ్ యాదవ్ ఎంతో చురుకుగా పనిచేసేవారని.. చిరంజీవి అంటే ఆయనకు ఎంతో అభిమానం అని సహచరులు అంటున్నారు. ఆయన మృతి విషయం తెలిసి చిరంజీవి అభిమానులు, జనసైనికులు, టీడీపీ, వైసీపీ నాయకులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతికి నివాళులర్పించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇది చదవండి: అచ్యుతాపురం సెజ్‌లో విషవాయువు లీక్.. 150 మంది మహిళలకు తీవ్ర అస్వస్థత!
ఇది చదవండి: తిరుపతి మహిళా వర్సిటీలో కేఏ పాల్‌హంగామా.. పోలీసులు కేసు నమోదు!