ఈ మద్య దేశంలో ప్రతిరోజూ ఎక్కడో అక్కడ రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. కారణాలు ఏవైనా ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. మరికొంత మంది అంగవైకల్యంతో ఎన్నో అవస్థలు పడుతున్నారు. తాజాగా విశాఖపట్టణంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఉత్తరాంధ్ర చిరంజీవి అభిమానుల సంఘం కన్వీనర్ యడ్ల లక్ష్మణ్‌యాదవ్ దుర్మరణం పాలయ్యారు. వివరాల్లోకి వెళితే.. విశాఖపట్టణం మధురవాడకు చెందిన లక్ష్మణ్‌యాదవ్ ఆర్టీసీ డ్రైవర్ పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. గత కొంత కాలంగా జనసైనికుడిగా, ఉత్తరాంధ్ర చిరంజీవి […]