మూడు రాజధానులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. సీఆర్డీఏ చట్టం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించాలని.. 6 నెలల్లో అభివృద్ధి ప్రణాళిక పూర్తి చేయాలని కోర్టు.. ప్రభుత్వాన్ని ఆదేశించింది. భూములిచ్చిన రైతులకు 3 నెలల్లో అన్ని సౌకర్యాలతో అభివృద్ధి చేసిన ప్లాట్లు అప్పగించాలని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ విషయంపై రాజధాని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై మెగా బ్రదర్ నాగబాబు కూడా స్పందించారు.
హైకోర్టు తీర్పుపై రాజధాని రైతులకు నాగబాబు శుభాకాంక్షలు తెలిపారు. మొక్కవోని దీక్షతో అనుకున్నది సాధించారని కొనియాడారు. ‘హైకోర్టు తీర్పుతో ఎంతో సంతోషంగా ఉంది. రైతులు ఇన్ని రోజులు పట్టుదలగా దీక్ష చేశారు. మొదట్లో వైసీపీ ప్రభుత్వం కూడా ఒప్పుకుని తర్వాత మూడు రాజధానులను తెరపైకి తీసుకొచ్చారు. ఇవ్వనీ స్పాన్సర్డ్ ఉద్యమం అన్నారు. స్పాన్సర్డ్ పోరాటాలు ఎప్పుడూ ఎక్కువ రోజులు నిలబడవు’.
‘కడుపు మంట నుంచి వచ్చిన దీక్ష కాబట్టే ఇన్ని రోజులు ఉండగలిగింది. వైసీపీ నాయకులకు నేను ఇచ్చే సూచన ఏంటంటే.. ఈ తీర్పుతో ఇక్కడితో ఊరుకోండి. మళ్లీ సుప్రీంకోర్టుకు వెళ్లకండి. ఏ ప్రభుత్వం అయినా ప్రజలతో శత్రుత్వం పెట్టుకున్న ప్రభుత్వం నిలవదు. ఇప్పటికైనా పంతాలు, పౌరుషాలకు పోకండి’ అంటూ నాగబాబు వ్యాఖ్యానించారు. నాగబాబు వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లైవ్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.