కడప ఎంపీ, వైసీపీ నేత వైఎస్ అవినాశ్ రెడ్డికి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఇటీవల ఆయన తల్లి శ్రీలక్ష్మి అనారోగ్యానికి గురైన సంగతి విదితమే. ఈ నెల 19 నుంచి కర్నూలులోని విశ్వ భారతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అక్కడి నుండి డిశ్చార్జి చేసి ప్రస్తుతం ఆమెను హైదరాబాద్ తరలించారు.. ఇంతలో
కడప ఎంపీ, వైసీపీ నేత వైఎస్ అవినాశ్ రెడ్డికి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఇటీవల ఆయన తల్లి శ్రీలక్ష్మి అనారోగ్యానికి గురైన సంగతి విదితమే. ఈ నెల 19 నుంచి కర్నూలులోని విశ్వ భారతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అక్కడి నుండి డిశ్చార్జి చేసి ప్రస్తుతం ఆమెను హైదరాబాద్ తరలించారు. గబ్బిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. అక్కడకు వెళుతుండగానే ఆయనకో మరో వార్త చేరింది. ఆయన తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి అస్వస్థతకు గురైనట్లు సమాచారం అందింది. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నభాస్కర్ రెడ్డి అరెస్టై ప్రస్తుతం చంచల్ గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉంటున్నారు. అయితే శుక్రవారం ఆయన జైలులో అస్వస్థతకు గురయ్యారు. దీంతో జైలు అధికారులు ఆయన్ను హుటా హుటిన ఆసుపత్రికి తరలించారు.
చంచల్ గూడలో ఖైదీగా ఉన్న భాస్కర్ రెడ్డికి ఒక్కసారిగా రక్తపోటు పెరిగింది. దీంతో ఆయన అనారోగ్యం బారిన పడటంతో.. ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షలు నిర్వహించి.. బీపీ పెరగడంతో అస్వస్థతకు గురయ్యారని.. చికిత్స అందించాలని స్పష్టం చేశారు. అవసరమైతే మెరుగైన చికిత్స కోసం నిమ్స్‌కు తీసుకెళ్లాలని వైద్యులు సూచించినట్టు తెలుస్తోంది. వైద్య పరీక్షలు పూర్తయిన అనంతరం.. తిరిగి చంచల్ గూడ జైలుకు తరలించారు. వైద్యుల సూచన మేరకు వైఎస్ భాస్కర్ రెడ్డిని.. జైలు అధికారులు శనివారం నిమ్స్‌కు తరలించనున్నారని సమాచారం. అక్కడ చికిత్స్ అందించే ఏర్పాట్లు చేయనున్నారు. వివేకానంద రెడ్డి హత్య కేసులో వైఎస్ భాస్కర్‌రెడ్డిని సీబీఐ అధికారులు ఏప్రిల్ 16న తెల్లవారుజామున ఆయన నివాసం నుంచి అరెస్ట్ చేసిన సంగతి విదితమే.