భారతదేశం ఎన్నో కళలకు, విద్యలకు ప్రసిద్ధి చెందినది. నేడు ఎన్నో దేశాలు తమ సంస్కృతిలో భాగంగా చేసుకున్న అనేక విద్యలు, క్రీడలు భారతదేశం నుంచి తరలివెళ్లినవే. అయితే విదేశీయలు దండయాత్రలు, ఆంగ్లేయుల పాలన కారణంగా పురాతన విద్యలు, క్రీడలు కనుమరుగవుతూ వస్తున్నాయి. వాటిల్లో విలువిద్య కూడా ఒకటి. కొన్నేళ్ల క్రితం వరకు కూడా మన దేశంలో కనుమరుగయిపోయి.. ప్రస్తుతం మళ్లీ నిలదొక్కుకుంటున్న క్రీడ విలువిద్య. వేల సంవత్సరాలుగా విలు విద్య మన దేశంలో ఉంది. కానీ ఇప్పటికి ఒలంపిక్స్‌లో ఒక్క పతకం కూడా సాధించలేకపోయాం. ఈ పరిస్థితిలో మార్పు రావాలని.. ప్రపంచ వేదికల మీద విలువిద్యలో మన దేశీయులు రాణించాలనే ఉద్దేశంతో ఓ ఆర్చరీ అకాడమీని ప్రారంభించాడు కడపకు చెందిన ఓ యువకుడు. ఎందరికో విలువిద్యలో శిక్షణ ఇస్తూ.. వారు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా శిక్షణ ఇస్తున్నాడు. ఆ వివరాలు..
ఇది కూడా చదవండి: మనవడు దేవాన్ష్ పుట్టినరోజు.. భారీ విరాళం ఇచ్చిన చంద్రబాబు!
కడపకు చెందిన వడ్తి ఉదయ్ కుమార్ విజయ ఆర్చరీ అకాడమీ ప్రారంభించి.. ఎందరికో విలువిద్యలో శిక్షణ ఇస్తున్నాడు. ఇతడి దగ్గర శిక్షణ పొందిన వారిలో ఇద్దరు జాతీయ స్థాయిలో బంగారు పతకాలు కూడా సాధించారు. ప్రభుత్వం తనకు సాయం చేస్తే.. మరింత మందికి శిక్షణ ఇచ్చి.. ఒలంపిక్స్‌లో పతకం సాధిస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నాడు ఉదయ్ కుమార్. పూర్తి వివరాల కోసం ఈ కింద వీడియో చూడండి. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: విధి విచిత్రం: ఒకప్పుడు మంత్రి.. ఇప్పుడు క్యాబ్ డ్రైవర్!
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.