పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. రాజకీయాల్లో చురుగ్గా రాణిస్తున్నారు. వరుస పర్యటనలతో నిత్యం ప్రజల్లో ఉంటూ.. వారి సమస్యలపై అలుపెరుగని పోరాటం చేస్తున్నాడు. మరీ ముఖ్యంగా కౌలు రైతులను ఆదుకోవడం కోసం రైతు భరోసా యాత్ర చేపట్టిన సంగతి తెలిసిందు. ఈ సందర్భంగా ఓ పేద కుటుంబానికి ఇచ్చిన హమీని నిలబెట్టుకున్నాడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. పేదింటి ఆడబిడ్డ కల సాకారం చేసుకునేందుకు కావాల్సిన ఆర్థిక సాయం అందించి.. ఆ కుటుంబంలో సంతోషం నింపారు. ఆ వివరాలు.. పవన్ కళ్యాణ్ కౌలు రైతు భరోసా యాత్ర సందర్భంగా శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం గొట్లూరులో పర్యటించిన సందర్భంగా ఆయన.. ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన కౌలు రైతు.. నిట్టూరు బాబు కుటుంబాన్ని పరమార్శించారు.
ఈ సందర్భంగా బాబు కుటుంబానికి లక్ష రూపాయల ఆర్థిక సాయం అందజేశారు పవన్ కళ్యాణ్. ఆ సమయంలో బాబు కుమార్తె హలీమా.. తనకు ఎస్సై కావాలని ఉందని.. అందుకు తగిన సాయం చేయాలని పవన్ కళ్యాణ్‌ని కోరింది. పవన్ కూడా అంగీకరించారు. ఈ క్రమంలో హలీమాకు ఇచ్చిన హామీ మేరకు ఎస్సై కోచింగ్ కోసం ఆమెను మంగళవారం హైదరాబాద్‌కు పంపించారు.
హలీమా కోచింగ్‌కు అయ్యే ఖర్చు మొత్తం భర్తిసామని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్‌రెడ్డి ఈ సందర్భంగా వివరించారు. బాబు కుటుంబానికి జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ అండగా నిలుస్తున్నారని తెలిపాడు. ఈ సందర్భంగా తనకు అందిన సాయం పట్ల హలీమా తన ఆనందాన్ని వ్యక్తం చేసింది. జనసేన పార్టీ నేతలకు కృతజ్ఞతలు తెలియజేసింది. కష్టపడి చదివి.. తప్పకుండా ఎస్సై ఉద్యోగం సాధిస్తానని తెలిపింది. ఈ వార్త తెలిసి జనసేన కార్యకర్తలు, పవన్ అభిమానులు ఆయనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. పవన్ చేసిన సాయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
My heartfelt best wishes to ‘Sister Halima’.And I congratulate @MadhusudhanJSP garu and Anantpur JSP leaders and janasainiks. https://t.co/v6ngYLaZUW
— Pawan Kalyan (@PawanKalyan) December 13, 2022
Thread : 1
కౌలు రైతులు భరోసా యాత్రలో భాగంగా బాధిత కుటుంబాలను పరామర్శించడానికి శ్రీ @PawanKalyan గారు ధర్మవరం నియోజకవర్గం గొట్లురు గ్రామానికి వచ్చినప్పుడు మైనారిటీ కుటుంబానికి చెందిన నిట్టూరు బాబు గారి కుటుంబాన్ని పరామర్శించి 1 లక్ష రూపాయలు ఆర్థిక సాయం అందించి నిట్టూరు బాబు pic.twitter.com/tBLDl9Ag1g— Chilakam Madhusudhan Reddy (@MadhusudhanJSP) December 13, 2022
ఆడబిడ్డకు జనసేనాని ప్రోత్సాహకం
12-04-2022
SI కావాలని ఉంది అంటూ శ్రీ @PawanKalyan గారికి తెలిపిన ఆత్మహత్య చేసుకున్న ముస్లిం రైతు కూతురు. నేను చూసుకుంటాను అంటూ హామీ ఇచ్చిన జనసేనాని.
13-12-2022
ఇచ్చిన హామీ ప్రకారం హాలీమా SI శిక్షణ కోసం సాయం అందించిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు. pic.twitter.com/UqVUhyoip2— JanaSena Shatagni (@JSPShatagniTeam) December 14, 2022