తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడిని దర్శించుకునేందుకు ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు తిరుమలకు వస్తుంటారు. అలానే టీటీడీ బోర్డు భక్తులకు అనేక రకాల సౌకర్యాలు కలిపిస్తుంది. అలానే రైల్వేశాఖ కూడా శ్రీవారి భక్తులకు ఓ గుడ్ న్యూస్ చెప్పింది.
తిరుమల తిరపతి పుణ్యక్షేత్రం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడిని దర్శించుకునేందుకు ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు తిరుమలకు వస్తుంటారు. అలానే టీటీడీ బోర్డు భక్తులకు అనేక రకాల సౌకర్యాలు కలిపిస్తుంది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టీటీడీ బోర్డు చర్యలు తీసుకుంటుంది. ఇక తిరుమలకు వెళ్లే ప్రయాణికులకు వివిధ రవాణ సంస్థలు కూడా తరచూ ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. తాజాగా ఈ సమ్మర్ కు తిరుపతికి వెళ్లాలనుకునే వారికి రైల్వేశాఖ ఓ గుడ్ న్యూస్ చెప్పింది. తక్కువ ధరకే తిరుమల తిరుపతికి చేరేలే ఓ కొత్త టూర్ ను ప్రకటించింది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం
తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రానికి వెళ్లాలని ప్లాన్ చేసుకుంటున్నవారికి ఐఆర్ సీటీసీ గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్ నుంచి తిరుపతి స్పెషల్ టూర్ ప్యాకేజీని ప్రకటించింది. ‘గోవిందం’ టూర్ పేరుతో ప్రత్యేక ప్యాకేజీని అందుబాటులోకి తీసుకుని వచ్చింది. ఈ ప్రయాణం రెండు రాత్రులతో మూడు రోజుల పాటు కొనసాగనుంది. అంతేకాక కేవలం రూ.4000 లోపు ధరకే టూర్ ప్యాకేజీ అందిస్తుంది. ఇక ఈ గోవిందం టూర్ ప్యాకేజీ ఐఆర్సీటీసీలో రోజూ అందుబాటులో ఉండనుంది. ఎవరైనా తక్కువ సమయంలో శ్రీవారిని దర్శించుకోవాలనుకునేవారికి ఈ టూర్ ప్యాకేజీ ఎంతగానో ఉపయోగపడుతుంది.
ఈ ప్రత్యేక ప్యాకేజీతో తిరుపతి వెళ్లే భక్తులకు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు ప్రత్యేక దర్శనం ఉంటుంది. తిరుమలతో పాటు తిరుచానూరు కూడా దర్శించుకోవచ్చు. మూడు రోజుల పాటు ఈ యాత్ర సాగుతుంది. ఐఆర్‌సీటీసీ గోవిందం టూర్ ప్యాకేజీలో తిరుమల వెళ్లే భక్తులు తొలిరోజు 12734 నెంబర్ రైలు ఎక్కాలి. రోజూ సాయంత్రం లింగపల్లి నుంచి తన ప్రయాణాన్ని మొదలు పెడుతుంది. 5.25 గంటలకు లింగంపల్లిలో మొదలు పెట్టి.. మరుసటి రోజు ఉదయం ఆరు గంటలకు తిరుపతి రైల్వే స్టేషన్ కు చేరుకుంటారు.
ఇక్కడ కాలకృత్యాలు, ఇతర పనులు పూర్తి చేసుకుని శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వెళ్తారు. ఉదయం 9 గంటలకు శ్రీవారి ప్రత్యేక దర్శనం ఉంటుంది. అనంతరం తిరిగి తిరుమల నుంచి తిరుమతికి చేరుకుంటారు. మధ్యాహ్న భోజనాలు పూర్తైన తరువాత పద్మావతి అమ్మవారి దర్శనం కోసం తిరుచానూర్ వెళ్తారు. చివరగా తిరుపతి రైల్వేస్టేషన్ కు చేరుకుని సాయంత్రం 6.25 గంటలకు 12733 నెంబర్ ఉన్న రైలు ఎక్కాల్సి ఉంటుంది. మూడో రోజు తెల్లవారు జామున సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు ఏడు గంటల ప్రాంతంలో చేరుకుంటుంది.
చివరగా రైలు లింగపల్లి చేరుకోవడంతో గోవిందం టూర్ ముగుస్తుంది. గోవిందం యాత్రలో ప్యాకేజీ ధరలను రెండు రకాలుగా ఐఆర్సీటీసీ అందుబాటులోకి తీసుకుని వచ్చింది. స్టాండర్డ్ ప్యాకేజీ ధరల విషయానికి వస్తే.. సింగిల్ షేరింగ్ ధర రూ.4,950, డబుల్ షేరింగ్ ధర రూ.3,800, ట్రిపుల్ షేరింగ్ ధర రూ.3,800గా నిర్ణయించారు. అలానే కంఫర్ట్ ప్యాకేజీ ధరల విషయానికి వస్తే.. సింగిల్ షేరింగ్ ధర రూ.6,790, డబుల్ షేరింగ్ ధర రూ.5,660లు గా నిర్ణయించారు.
స్టాండర్డ్ ప్యాకేజీని ఎంచుకున్నవారు స్లీపర్ క్లాస్ లో, కంఫర్ట్ ప్యాకేజీ వాళ్లు థర్డ్ ఏసీ రైలు ప్రయాణం ఉండనుంది. ఇక ఈ గోవిందం టూర్ లో తిరుపతిలో దిగిన తరువాత ఏపీ వాహనంలో రవాణా, హోటల్‌లో వసతితో పాటు.. రైల్వే శాఖ వెంకన్న దర్శనం కోసం ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేస్తుంది. బీమా సౌకర్యం కూడా ఉంది. మరిన్ని వివరాల కోసం ఐఆర్సీటీసీ లో చూడండి. మరి.. ఐఆర్సీటీ ఈ ప్రత్యేక ప్యాకేజీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.