శ్రీకాకుళం జిల్లాలో రణస్థలం వేదికగా జనసేన పార్టీ నిర్వహించిన యువశక్తి సభలో హైపర్ ఆది సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ పై విమర్శలు చేసే వైసీపీ నేతలపై ఘాటు విమర్శలు చేశారు. పవన్ కళ్యాణ్ కి హైపర్ ఆది వీరాభిమాని అని సంగతి తెలిసిందే. ఈ సభలో పవన్ ని ఆకాశానికి ఎత్తేస్తూనే.. పవన్ ని విమర్శించే నాయకులపై సెటైర్లు విసిరారు. హైపర్ ఆది మాట్లాడుతూ.. ‘ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచన తప్ప.. మోసం చేయాలన్న ఆలోచన లేని రాజకీయ నాయకులతో నిండిన సభను మొదటిసారిగా చూస్తున్నాను. ఈ సభకి వచ్చిన జనాలని చూసి ఇప్పటికే కొంతమంది కుళ్లుతో చచ్చిపోయి ఉంటారు. వాళ్ళ కోసం ఒక్క సెకండ్ మౌనం పాటించండి’ అని అన్నారు.
ఎలాంటి పదవి అయినా కొన్ని సంవత్సరాలు కష్టపడితే దక్కుతుంది. కానీ పవన్ కళ్యాణ్ అనే పదవి దక్కించుకోవడం ఎవరి వల్ల కాదని అన్నారు. ఆయన స్థాయి వేరు, ఆ స్థానం వేరు అని ఆది అన్నారు. ఒక సినిమా వాడిగా మాట్లాడడానికి ఇక్కడకు రాలేదని.. జనసేన సిద్ధాంతాలు నచ్చి.. ఆ పార్టీలో తానొక అభ్యర్థిలాగ మాట్లాడడానికి వచ్చానని అన్నారు. ఇక్కడకి వచ్చిన ఎవరైనా సరే.. మందు బాటిల్స్ మీద గానీ, బిర్యానీ ప్యాకెట్ల మీద ఆశతో వచ్చినవాళ్లు కాదని అన్నారు. వాళ్ళ భవిష్యత్తు మీద భయం కలిగి వచ్చారని, పవన్ కళ్యాణ్ మీద నమ్మకంతో వచ్చారని అన్నారు. మీ నమ్మకాన్ని 100 శాతం వమ్ము చేయకుండా న్యాయం చేసే బాధ్యత పవన్ కళ్యాణ్ దని అన్నారు. ఇక పవన్ ని విమర్శించే వాళ్లకి కూడా తన శైలిలో చురకలు అంటించారు.
రెండు చోట్ల ఓడిపోయాడు అని అంటున్న వారికి.. హైపర్ ఆది గట్టి కౌంటర్ ఇచ్చారు. ఓడిపోతేనే ఇంతమంది కష్టాలు తీర్చాడంటే.. గెలిస్తే వాళ్ళ కష్టాలు కాంపౌండ్ వాల్ దాటనివ్వకుండా చూసుకుంటారని అన్నాడు. రికార్డులు కొల్లగొట్టడానికి, ఆస్తులు కూడబెట్టుకోవడనికో సినిమాలు చేసేవాళ్ళని చూసుంటారు.. కానీ కౌలు రైతుల కష్టాలను తీర్చడం కోసం సినిమా ఒప్పుకున్న హీరో పవన్ కళ్యాణ్ అని అన్నారు. డబ్బు మీద ఆసక్తి లేని వ్యక్తి రాజకీయాల్లోకి వస్తే.. ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతీ రూపాయి ప్రజలకు ఖర్చు పెట్టే వ్యక్తి పవన్ కళ్యాణ్ అని అన్నారు. అలాంటి వ్యక్తిని తిడుతున్న ఏపీ మంత్రులపై హైడెప్ర్ అది సెటైర్స్ విసిరారు.
‘ప్రెస్ మీట్లు పెట్టి పవన్ కళ్యాణ్ ని తిడుతున్నారు.. ఆ శాఖ.. ఈ శాఖ అని అన్ని పేర్లెందుకు? పవన్ కళ్యాణ్ ని తిట్టే శాఖ అని పెట్టుకుని కంటిన్యూగా తిట్టుకోండి’ అంటూ చురకలు అంటించారు. శాఖల పరువులు తీస్తున్నారంటూ వైసీపీ మంత్రులపై ఫైర్ అయ్యారు. ఇక వారాహి వాహనాన్ని ఏపీలో అడుగుపెట్టనివ్వనని అనడం, దత్తపుత్రుడు, నిలకడ లేని రాజకీయాలు చేస్తారని అనే వైసీపీ మంత్రులపై హైపర్ ఆది ఘాటుగా బదులిచ్చారు. ఆయన అభిమానించే అభిమానులుగా మాకు కోపం వస్తుందని అన్నారు. ప్రతీ ఒక్కరికి ఒక లక్ష్యం ఉంటుందని, తనకు కూడా ఒక లక్ష్యం ఉందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తే చూడాలని హైపర్ ఆది అన్నారు. మరి వైసీపీ మంత్రులపై హైపర్ ఆది చేసిన కామెంట్స్ పై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.