భార్యాభర్తల మధ్య గొడవలు అనేది సర్వసాధారణం. అయితే ఈ గొడవలు పెద్దవిగా మారినప్పుడు మాత్రమే దారుణాలు చోటుచేసుకుంటాయి. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో దంపతలు మధ్య జరుగుతున్న వివాదల కారణంగా అనేక ఘోరాలు జరుగుతున్నాయి. క్షణికావేశంలో భాగస్వామిపై దాడి చేసి..హత్య చేస్తున్నారు. ఇటీవల కాలంలో కర్నూలు జిల్లాలో పెళ్లైన వారానికి భార్యను ఓ భర్త దారుణంగా హత్య చేశాడు. తాజాగా పల్నాడు జిల్లాలో కూడా ఓ ఘోరం జరిగింది.
భార్యాభర్తల మధ్య గొడవలు అనేది సర్వసాధారణం. అయితే ఈ గొడవలు పెద్దవిగా మారినప్పుడు మాత్రమే దారుణాలు చోటుచేసుకుంటాయి. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో దంపతలు మధ్య జరుగుతున్న వివాదల కారణంగా అనేక ఘోరాలు జరుగుతున్నాయి. క్షణికావేశంలో భాగస్వామిపై దాడి చేసి..హత్య చేస్తున్నారు. ఇటీవల కాలంలో కర్నూలు జిల్లాలో పెళ్లైన వారానికి భార్యను ఓ భర్త దారుణంగా హత్య చేశాడు. అలానే విశాఖ జిల్లాలో కూడా భార్య తన మాట వినడం లేదని పీకపిసి చంపేశాడు. తాజాగా కాపురానికి రాలేదని భార్యపై కాగుతున్న నూనె పోశాడు ఓ భర్త. ఈ ఘటన పల్నాడు జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
పల్నాడు జిల్లా వినుకొండ నియోజక వర్గంలోని ఈపూరు మండలంలోని కూచినపల్లి గ్రామానికి చెందిన బొగ్గవరపు నాగరాజు, కోటేశ్వరమ్మ దంపతులు. వీరు ఉపాధి నిమిత్తం పిడుగురాళ్లకి వెళ్లారు. అక్కడే భార్యాభర్తలు పనులు చేసుకుంటూ జీవినం సాగిస్తున్నారు. అలా సంతోషంగా సాగుతున్న వారి కాపురంలో కొంతకాలం నుంచి గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల దంపతుల మధ్య మరోసారి గొడవ జరిగింది. ఈక్రమంలో భర్తపై కోపంతో కోటేశ్వరమ్మ 15రోజుల క్రితం పుట్టింటికి కూచినపల్లి వచ్చింది. కాపురానికి రావాలని భార్యకు నాగరాజు ఫోన్లు చేసేవాడంట. అయితే ఆమె ససేమిరా అనడంతో ఆదివారం భార్యను కాపురానికి తీసుకెళ్లడానికి నాగరాజు కూచినపల్లి వెళ్లాడు.
ఇదే సమయంలో మార్గం మధ్యలో మద్యం సేవించి కూచినపల్లికి వెళ్లాడు. మద్య మత్తులో భార్య కోటేశ్వరమ్మతో వాగ్వాదానికి దిగాడు. అదే సమయంలో కోటేశ్వరమ్మ పిండి వంటలు చేస్తూ భర్త మాటలకు సమాధానం చెబుతోంది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాటమాట పెరిగింది. దీంతో క్షణికావేశానికి లోనైన నాగరాజు కళాయిలో కాగుతున్న నూనె కోటేశ్వరమ్మ తలపై కుమ్మరించాడు. దీంతో తీవ్రంగా గాయపడి కోటేశ్వరమ్మను కుటుంబ సభ్యులు నరసరావుపేట ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం మెరుగైన చికిత్స కోసం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరి.. ఇలా దంపతులు క్షణికావేశంలో దారుణమైన నిర్ణయాలు తీసుకుని జీవితాలను బలి చేసుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.