ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ వేడి రాజుకొంది. ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉన్నా.. రాష్ట్రంలో అధికార, ప్రతిపక్షాల తీరు చూస్తుంటే ఎన్నికల వాతావరణాన్ని తలపిస్తోంది. ఇటీవల పవన్ కల్యాణ్‌పై వైసీపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి జనసేన– వైసీపీ శ్రేణులు, కార్యకర్తల మధ్య మాటల యుద్ధం ఊపందుకుంది. మంత్రి అమర్నాథ్ వ్యక్తిగత దూషణలకు దిగడంతో జనసేన కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా తీవ్ర విమర్శలు చేయడం మొదలు పెట్టారు. అందులో భాగంగా అమర్నాథ్ గతంలో పవన్ కల్యాణ్ తో దిగిన ఫొటో ఒకటి వైరల్ చేశారు.
ఇదీ చదవండి: AP మంత్రి గుడివాడ అమర్నాథ్‌ని ట్రోల్ చేస్తున్న పవన్ కల్యాణ్ ఫ్యాన్స్!
ఆ విషయంపై స్పందించిన అమర్నాథ్ మరో వివాదానికి తెరలేపారు. పవన్ కల్యాణ్ తనతో ఫొటో దిగారే తప్ప.. తాను వెళ్లలేదని, ఎవరు చేతులు కట్టుకుని ఉన్నారో మీరే చూడాలంటూ మళ్లీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మంత్రి వ్యాఖ్యలపై జనసేన నేతలు తీవ్రంగా మండిపడ్డారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఆగడాలు ఎక్కువయ్యాయంటూ దుయ్యబట్టారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెబుతారని వ్యాఖ్యానించారు. ఏపీలో రాబోయే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వాన్ని 15 సీట్లకే పరిమితం చేస్తామంటూ జనసేన నేతలు తెలియజేశారు. జనసేన నేతల వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలిజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.