రైతులకు ఏపీ ప్రభుత్వం మరో శుభవార్తను అందించింది. త్వరలో చుక్కల భూముల పత్రాలను రైతులకు అందచేస్తామని తెలిపింది. తాజాగా మంత్రి కాకాణి గోవర్దన్ మీడియాతో మాట్లాడుతూ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు
ఇటీవల ఈ రబీ సీజన్ లో రైతులను పండించిన గోధుమ, బార్లీ, పప్పుధాన్యాలు, శనగలు వంటి పంటలను ప్రభుత్వం ఎక్కువ ధరకు కొనుగోలు చేస్తుందని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయంతో ఏపీ రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇది మరువక ముందే జగన్ సర్కార్ తాజాగా రైతులకు మరో శుభవార్తను అందించింది. త్వరలో చుక్కల భూముల పత్రాలను రైతులకు అందచేస్తామని తెలిపింది.
ఈ సందర్భంగా ఏపీ వ్యవసాయం, సహకార, మార్కెటింగ్ శాఖ మంత్రి కాకాణి గోవర్దన్ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. చుక్కల భుములపై సీఎం జగన్ మోహన్ రెడ్డి తీసుకున్నది చారిత్రాత్మక నిర్ణయమని. రైతుల సమస్యల గురించి జగన్ చాలా బాగా ఆలోచిస్తారని అన్నారు. ఇక ఈ క్రమంలోనే సీఎం జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఉన్న చుక్కల భూములకు పట్టాలు ఇవ్వాలని ఆదేశించారన్నారు. అంతేకాకుండా అభ్యంతరాలు లేని భూములను కూడా రెగ్యులర్ చేయాలని ఆయన అన్నారని మంత్రి కాకాణి గోవర్దన్ తెలిపారు. తాజాగా ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.