రాష్ట్రంలో పారిశ్రామికవృద్ధి లక్ష్యంగా విశాఖపట్నం వేదికగా నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సదస్సుకు భారీ స్పందన వస్తోంది. మూడు రోజుల పాటు సాగే ఈ సదస్సు తొలి రోజు శుక్రవారం నాడు ఏపీకి పెట్టుబడులు వెల్లువెత్తాయి. ఆ వివరాలు..
ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి సారి విశాఖ వేదికగా గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు నిర్వహించింది. ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్-2023 పేరిట విశాఖపట్నంలో నిర్వహించిన సదస్సు దేశ, విదేశాల నుంచి పారిశ్రామిక వేత్తలు హాజరయ్యారు. గత మూడేళ్ల నుంచి ఈజ్ ఆఫ్ డూయింగ్‌లో ప్రథమ స్థానంలో కొనసాగుతున్న ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి పరిశ్రామిక వేత్తలు ఆసక్తి చూపారు. సమ్మిట్ వేదికగా ఏపీకి పెట్టుబడులు ప్రవాహం తరలి వచ్చింది. తొలిరోజే ఏకంగా రూ.11.85 లక్షల కోట్లకు.. సంబంధించిన 92 ఎంవోయూలు కుదుర్చుకోడం అసాధారణ విషయం అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. దక్షిణ భారతదేశంలో ఎలాంటి పారిశ్రామిక సదస్సుకు హాజరు కానీ.. రిలయన్స్ సంస్థల అధినేత ముఖేష్ అంబానీ.. విశాఖ వేదికగా జరుగుతున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌కు హాజరయ్యారు. అంతేకాక ఏపీలో రిలయన్స్ పెట్టుబడులు పెట్టనుందని ప్రకటించారు.
ఏపీలో 10 గిగావాట్ల రెన్యూబుల్ సోలార్ ఎనర్జీ ప్లాంట్ ఏర్పాటు చేయబోతున్నట్లు.. ముఖేశ్ అంబానీ ప్రకటించారు. అలానే మరో దిగ్గజ సంస్థ జిందాల్ కూడా ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూసింది. ష్ణ పట్నం సమీపంలో 3 మిలియన్ టన్నుల స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు జిందాల్ గ్రూపు ఛైర్మన్ నవీన్ జిందాల్ సంసిద్ధత వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్ట్ కోసం రూ.10వేల కోట్ల పెట్టుబడులను పెట్టనున్నట్లు ఆయన ప్రకటించారు. దీని ద్వారా ఏపీలో ప్రత్యక్షంగా, పరోక్షంగా మొత్తం 10 వేల మందికి ఉపాధి లభిస్తుందని తెలిపారు.
ఇక జీఐఎస్ సదస్సులో పాల్గొన్న పారిశ్రామిక దిగ్గజాలు.. అంబానీ మొదలు.. బంగర్ వరకు ప్రతి ఒక్కరు సీఎం జగన్ విజన్‌పై ప్రశంసలు కురిపించారు. ఏపీలో సాగుతున్న సంక్షేమ, అభివృద్ధి పాలనను మెచ్చుకున్నారు. జగన్‌తో కలిసి వేదిక మీదకు వచ్చిన అంబానీ.. సభ ముగిస్తే వరకు.. ఉండటమే కాక.. జగన్‌తో పలు అంశాలు చర్చిస్తూ.. ఎంతో ఉల్లాసంగా కనిపించారు. తన ప్రసంగం ముగిసిన తర్వాత జగన్ వేదికపై ఉన్న పారిశ్రామికవేత్తల వద్దకు వెళ్లి.. పేరుపేరునా నమస్కరించి పలకరించారు. ఎంవోయూ కార్యక్రమం తర్వాత పారిశ్రామికవేత్తలను శాలువా, జ్ఞాపికలతో సన్మానించారు జగన్. మరి ఏపీకి వెల్లువెత్తున్న పెట్టుబడులపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.