గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023లో ఏపీకి కనీవినీ ఎరుగని స్థాయిలో పెట్టుబడులు వచ్చాయి. రెండు రోజుల్లో 13 లక్షల కోట్లకు పెట్టుబడులు వచ్చాయి. మొత్తం 352 ఎంఓయూలు జరిగాయి. శాఖల వారీగా పెట్టుబడులు ఎలా ఉన్నాయంటే?
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మొండి పట్టుదలకు కేరాఫ్ అడ్రస్‌లాంటి వారు. ఆయన ఏదైనా అనుకుంటే సాధించే వరకు వదిలిపెట్టరు. ఇప్పుడు ఏపీకి పెట్టుబడుల విషయంలో కూడా అదే జరిగింది. ఒక్క రోజులో లక్షల కోట్ల పెట్టుబడులను రాబట్టారు.
రాష్ట్రంలో పారిశ్రామికవృద్ధి లక్ష్యంగా విశాఖపట్నం వేదికగా నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సదస్సుకు భారీ స్పందన వస్తోంది. మూడు రోజుల పాటు సాగే ఈ సదస్సు తొలి రోజు శుక్రవారం నాడు ఏపీకి పెట్టుబడులు వెల్లువెత్తాయి. ఆ వివరాలు..
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ..జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఆల్ ది బెస్ట్ చెప్పారు. గతంలో జగన్ సర్కార్ తీసుకొచ్చిన జీవో నం.1ను కూడా లక్ష్మీనారాయణ సమర్థించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ఘనంగా ప్రారంభమైంది. ఈ సదస్సు రెండు రోజుల పాటు జరగనుంది. ఎడ్వాంటేజ్ ఏపీ నినాదంతో.. 14 రంగాల్లో ఈ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ను నిర్వహిస్తున్నారు. కేంద్ర మంత్రులు, పారిశ్రామికవేత్తలు, వివిధ దేశాల రాయబారులు, వాణిజ్య ప్రతినిధులు సదస్సుకు హాజరయ్యారు. ఈ సందర్బంగా రిలయన్స్ సంస్థల అధినేత ముకేష్ అంబానీ పెట్టుబడులకు సంభందించి కీలక ప్రకటన చేశారు.
ఏదైనా ప్రత్యేక కార్యక్రమాల సందర్భంగా వచ్చే అతిథులకు ప్రత్యేక వంటకాలతో.. మర్చిపోలేని విందు ఏర్పాటు చేస్తాం. మరి ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమం అందునా దేశ, విదేశాల ప్రతినిధులు హాజరయ్యే కార్యక్రమం అంటే.. ఇక అరెంజ్‌మెంట్స్ ఏం రేంజ్‌లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. విశాఖ వేదికగా జరుగుతున్న జీఎస్‌ఐ 2023 సదస్సు కోసం ప్రభుత్వం ప్రత్యేక వంటకాలను అతిథులకు వడ్డించనుంది. ఆ వివరాలు
విశాఖ సాగర నగరం వేదికగా గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ఘనంగా ప్రారంభమైంది. ఈ సమ్మిట్ కు దేశీయ పారిశ్రామిక దిగ్గజాలు సహా 45కు పైగా దేశాల నుంచి దౌత్యవేత్తలు, 14 వేల మందికిపైగా ప్రతినిధులు హాజరయ్యారు. దేశంలో అత్యధిక సముద్రతీర ప్రాంతం ఉన్న ప్రాంతం కావడంతో దేశ విదేశీ పారిశ్రామిక వేత్తలు ఎక్కువ ఆసక్తి కనపరిచారు.
ప్రముఖ వ్యాపార దిగ్గజం ముఖేష్ అంబానీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా ఇద్దరూ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించబోతున్న ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌పై తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఆసక్తికర కామెంట్లు చేశారు. ప్రస్తుతం కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.