శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. పలాస మండలం సుమ్మాదేవి వద్ద జాతీయరహదారిపై బొలేరోను లారీ ఢీకొట్టిన ఘటనలో నలుగురు పోలీసులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ఏఆర్ ఎస్‌ఐ, ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు, ఒక కానిస్టేబుల్ ఉన్నారు. బైరిసారంగపురంలో జవాను మృతదేహాన్ని అప్పగించి వస్తుండగా ప్రమాదం జరిగింది. జాతీయరహదారిపై రోడ్డు దాటుతుండగా బొలేరో వాహనాన్ని లారీ ఢీకొట్టింది. పోలీసుల వాహనం నుజ్జు నుజ్జు అయ్యింది.