ఈ మధ్యకాలంలో చైన్ స్నాచర్స్ బాగా రెచ్చిపోతున్నారు. మహిళల మెడలోని మంగళసూత్రాలను కొట్టేసి పారిపోతున్నారు. ఇటువంటి సంఘటనలు నిత్యం మనం చూస్తూనే ఉన్నాం. యూత్ విలాసవంతమైన జీవితానికి అలవాటుపడి అవసరాలకు ఈజీ మనీ కోసం దొంగతనాలు, దోపిడీలు చేస్తున్నారు.
ఈ మధ్యకాలంలో చైన్ స్నాచర్స్ బాగా రెచ్చిపోతున్నారు. మహిళల మెడలోని మంగళసూత్రాలను కొట్టేసి పారిపోతున్నారు. ఇటువంటి సంఘటనలు నిత్యం మనం చూస్తూనే ఉన్నాం. యూత్ విలాసవంతమైన జీవితానికి అలవాటుపడి అవసరాలకు ఈజీ మనీ కోసం దొంగతనాలు, దోపిడీలు చేస్తున్నారు. పోలీసులు వారికి గట్టిగా బుద్ధిచెప్పినా.. కౌన్సిలింగ్ ఇచ్చినా ఫలితం లేకుండా పోతుంది. అటు ఇంట్లో తల్లిదండ్రులను, ఇటు సమాజంలో దొంగతనాలు చేస్తూ భవిష్యత్ నాశనం చేసుకుంటున్నారు. వృద్ధ మహిళలు, ఒంటరిగా కనిపించిన మహిళలనే టార్గెట్ గా దొంగతనాలు చేస్తుంటారు. నేటి యువత జల్సాలకు అలవాటుపడి పనులు చేయడానికి చేతకాక తమ అవసరాలను తీర్చుకోవడానికి దొంగలుగా మారుతున్నారు. దొంగతనం చేసి దొరికిపోతే వారి భవిష్యత్ ఏమవుతుందో తెలుసుకోవడం లేదు.
ఆడవారికి బంగారంపై చాలా మోజు ఉంటుంది. అందుకే వారి ఒంటిపై బంగారాన్ని అలంకరించుకుని మురిసిపోతుంటారు. అయితే ఈ రోజుల్లో చైన్ స్నాచర్స్ ఎక్కవగా ఉండడంతో చాలా మంది బ్యాంక్ లాకర్లలో భద్రంగా పెట్టుకుంటున్నారు. ఏదైనా శుభకార్యాలకు వెళ్లాల్సివస్తే నగలను ధరిస్తున్నారు. గొలుసు దొంగలు ఒంటరి మహిళలు ఎక్కడ కనిపించినా కూడా పుస్తెలతాడును లాక్కెళుతున్నారు. సీసీ కెమెరాలను పరిశీలించి పట్టుకున్న తర్వాత కూడా చైన్ స్నాచర్స్ తగ్గట్లేదు. ఇంటిముందు నిలబడి కూడా చిన్న పనులు చేసుకునే వీలు లేకుండా గుబులు పుట్టిస్తున్నారు దుండగులు. అలాంటి సంఘటనే తాజాగా శ్రీకాకుళంలో జిల్లాలో జరిగింది. ఓ ఇంటిముందు గౌరి అనే మహిళ పూలు కోస్తుంటే దారివెంట ఓ యువకుడు వచ్చి ఆమె మెడలోంచి గొలుసు తెంపుకుని పారిపోయాడు. వివరాల్లోకి వెళితే..
శ్రీకాకుళం పట్టణం శ్రీలక్ష్మీ నగర్ కాలనీలో చైన్ స్నాచింగ్ జరిగింది. గౌరి అనే మహిళ పొద్దున్నే పూజకోసం పూలు కోయడానికి ఇంటి ముందున్న పూలచెట్టు దగ్గర నిలబడి పూలు కోస్తుంది. ఇంతలో ఓ యువకుడు అటువైపుగా వచ్చాడు. మహిళ మెడలోని బంగారం పుస్తెలతాడును తెంపుకొని పరుగులు తీశాడు. వెంటనే గౌరి తన భర్తతో కలిసి స్థానిక పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు సీసీ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాలను పరిశీలించారు. దుండగున్ని పట్టుకుంటామని హామీ ఇచ్చారు. గొలుసు తెంపుకుని దుండగుడు పారిపోయే దృశ్యాలు గల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.