ఇటీవల ఈజీ మనీ కోసొం కొంతమంది ఎన్నో దారుణాలకు పాల్పపడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కొంతకాలంగా చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఎక్కడో అక్కడ చోరీలు జరుగుతూనే ఉన్నాయి.
వరుస చైన్ స్నాచింగ్ ఘటనలతో మహిళలు భయంతో వణికిపోతున్నారు. ఇక అడుగు బయట పెట్టాలంటేనే జంకుతున్నారు. అయితే ఇద్దరు యువకులు పట్టపగలు మహిళ మెడలో ఉన్న చైన్ ను దొంగిలించాలని అనుకున్నారు. కానీ, అక్కడ సీన్ రివర్స్ అయింది.
గత కొంత కాలంగా దేశ వ్యాప్తంగా చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. ఒంటరిగా కనిపించే మహిళలు, వృద్దులను టార్గెట్ చేసుకొని బైక్స్ పై వచ్చి వారి మెడలో చైన్ లాక్కొని వెళ్తున్నారు. ఇలాంటి ఘటనలో కొన్నిసార్లు మహిళలు తీవ్రంగా గాయపడుతున్నారు.
హైదరాబాద్ లో చైన్ స్నాచర్ల ముఠా మరోసారి రెచ్చిపోయారు. రోడ్డుపూ ఒంటరిగా కనిపించిన మహిళలపై దాడులు చేస్తూ తాళిబొట్లు విలువైన అభరణాలు తీసుకెళ్తున్నారు. ఇలాంటి చైన్ స్నాచింగ్ ఘటనలు గతంలో ఏపీ తెలంగాణలో భారీగా చోటు చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనలు మరువకముందే తాజాగా హైదరాబాద్ లో చైన్ స్నాచర్ల ముఠా మరోసారి రెచ్చిపోవడం సంచలనంగా మారుతోంది. అయితే నగరంలోని గంటల వ్యవధిలోనే ఉప్పల్, ఓయూ, నాచారం, రామ్ గోపాల్ పేట వంటి ప్రాంతాల్లో […]