మూమూలుగా ప్రయాణాలు చేస్తున్న సమయంలో ఆటోలు, బస్సులు, రైళ్లు ఎక్కుతుంటాం. హడావుడి కారణంగా కొన్ని సార్లు లగేజీ, వస్తువులు, డాక్యుమెంట్లు, డబ్బు, నగలు ఉన్న బ్యాగులను ఆయా వాహనాల్లో వదిలేస్తుంటారు.
ఎదురుగా వెళ్తున్న వ్యక్తి రోడ్డుపై వంద రూపాయలు పడేసుకుంటే.. అతడికి చెప్పకుండానో, అడక్కుండానే లటుక్కున జేబులో వేసుకుంటుంటారు. రూపాయి కోసం ఎంతంటి నీచానికైనా ఒడిగడుతున్న రోజులవి. కానీ కొంత మంది నిజాయితీ పరులు ఇంకా దేశంలో ఉన్నారు అని నిరూపించేందుకు ఈ ఘటన ఓ ఉదాహరణ. మూమూలుగా ప్రయాణాలు చేస్తున్న సమయంలో ఆటోలు, బస్సులు, రైళ్లు ఎక్కుతుంటాం. హడావుడి కారణంగా కొన్ని సార్లు లగేజీ, వస్తువులు, డాక్యుమెంట్లు, డబ్బు, నగలు ఉన్న బ్యాగులను ఆయా వాహనాల్లో వదిలేస్తుంటారు. చివరకు ఆ వాహనాలు వెళ్లాక, లేదా ఇంటికి చేరాకో ఆ విషయం గుర్తుకు వస్తుంది. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. వాటిని ఇచ్చి ఇంకా నిజాయితీ, మానవత్వం బతికే ఉందని నిరూపిస్తున్నారు కొందరు.
బస్సుల్లో, ఆటోల్లో ఎక్కువగా ప్రయాణిస్తుంటాం. కంగారుగా ఎక్కి దిగడం కారణంగా మన వెంటే తీసుకెళ్లే బ్యాగులను మర్చిపోతుంటారు. ఇక అవి పోతే ఇంటికి తిరిగి వచ్చాయంటే.. వారంత అదృష్టవంతులు మరొకరు ఉండరు. ఆ తిరిగి తీసుకువచ్చిన వారి రుణం కూడా ఏమిచ్చినా తీర్చుకోలేం. అలా ఓ ప్రయాణీకుడు వదిలేసిన వస్తువుల్ని తిరిగి ఇచ్చి నిజాయితీ చాటుకున్నారు ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్. శ్రీకాకుళం జిల్లా పలాసలో ఓ బస్సు ప్రయాణీకుడు పొగొట్టుకున్ననగదు, వెండి వస్తువులను తిరిగి ఇచ్చేశారు డ్రైవర్ ఎస్‌కేరావు, కండక్టర్ పరసయ్య. పలాస డిపోకి చెందిన ఏపీ 30 జెడ్ 0016 బస్సు డైవర్, కండక్టర్ గా విధులు నిర్వర్తిస్తున్నారు వీరిద్దరూ.
బస్సు కవిటి నుంచి సోంపేట మీదుగా పలాస వచ్చింది. ఈ క్రమంలో బెజ్జుపుట్టుగకు చెందిన బడే మాధవరావు అదే బస్సు ఎక్కారు. బస్సు దిగే సమయంలో ఆయన వెంట తెచ్చుకున్న బ్యాగును ఆ బస్సులో వదిలేశారు. ఆ బ్యాగును చూసిన ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్ డిపో సెక్యూరిటీ విభాగానికి అందించారు. అందులో రూ.1.40 లక్షల డబ్బులు, 10 తులాల వెండి పట్టీలు ఉన్నాయి. ఆ తర్వాత ప్రయాణీకుడు.. డబ్బులు, ఆభరణాలను బస్సులో మర్చిపోయినట్లు గుర్తుకు వచ్చి.. పలాస డిపో అధికారులను సంప్రదించాడు. తగిన ఆధారాలు చూపడంతో సెక్యూరిటీ సిబ్బంది నగదు, వెండి వస్తువులను తిరిగి అతడికి అప్పగించారు. ప్రయాణికుడు మాధవరావు.. డ్రైవర్, కండక్టర్లకు కృతజ్ఞతలు తెలిపారు. అధికారులు కూడా వీరి నిజాయితీని కొనియాడుతూ.. అభినందించారు.