తెలుగు దేశం పార్టీ సీనియర్ నేత ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు గురువారం రాత్రి కన్నుమూశారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. బచ్చుల అర్జునుడు అంత్యక్రియాల్లో పాల్గొన్నారు. అంతేకాక చంద్రబాబు నాయుడు, అచ్చెన్నాయుడు అర్జునుడి పాడెను మోశారు.
తెలుగు దేశం పార్టీ సీనియర్ నేత ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు గురువారం రాత్రి కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన మరణంతో టీడీపీ శ్రేణుల్లో తీవ్ర విషాదం నెలకొంది. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి బచ్చుల అర్జునుడి భౌతికకాయానికి నివాళులర్పించారు. ఆయనను కడసారి చూసుకునేందుకు టీడీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. అచ్చెన్నాయుడు, ఎంపీ కేశినేని నాని, మాజీ మంత్రులు కొల్లు రవీంద్ర, దేవినేని ఉమ, కొనకళ్ల నారాయణ వంటి టీడీపీ సీనియర్ నేతలు బచ్చుల అర్జునుడి నివాసానికి చేరుకున్నారు. అంతేకాక అర్జునుడి పాడెను చంద్రబాబు నాయుడు, అచ్చెన్నాయుడు మోశారు. బచ్చుల అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించనున్నారు.
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బందర్ లోని సీనియర్ నేత, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు అంత్యక్రియలకు హాజరయ్యారు. బచ్చుల అర్జునుడి పాడె చంద్రబాబు మోశారు. అంతకంటే ముందు చంద్రబాబు అర్జునుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు. పార్టీ తరపున అండగా ఉంటామని వారికి హామీ ఇచ్చారు. బచ్చుల అర్జునుడి మృతి తమకు, పార్టీకి తీరని లోటని చంద్రబాబు అన్నారు. వైద్యులు ఎన్ని ప్రయత్నాలు చేసినా, అవయవాలు దెబ్బతినడం వల్ల అర్జునుడుని కాపాడుకోలేకపోయామన్నారు. వెనుకబడిన వర్గాల నుంచి వచ్చిన అర్జనుడు ఓ సామాన్య కార్యకర్తగా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి.. అనంతరం అంచెలంచెలుగా ఎదిగారని చంద్రబాబు అన్నారు. మచిలీపట్నం మున్సిపల్ చైర్మన్ గా ఆ ప్రాంత అభివృద్ధికి ఎంతో కృషి చేశారన్నారు.
ఎమ్మెల్సీగా అమరావతి తో పాటు వివిధ అంశాలపై గట్టిగా పోరాడారని, గన్నవరం నియోజకవర్గ సమన్వయకర్తగా ఉండి నాయకులందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి నడిపించారన్నారు. బచ్చుల అర్జునుడు గత కొన్ని రోజుల క్రితం అనారోగ్యంతో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరగా.. చికిత్సపొందుతూ గురువారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన మృతికి టీడీపీ శ్రేణులు, కార్యకర్తలు ఘన నివాళ్లు అర్పించారు. పలువరు పార్టీ సీనియర్ నేతలు మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. మరి..బచ్చుల అర్జునుడి అంతిమయాత్రలో జరిగిన ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.