తెలుగు దేశం పార్టీ సీనియర్ నేత ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు గురువారం రాత్రి కన్నుమూశారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. బచ్చుల అర్జునుడు అంత్యక్రియాల్లో పాల్గొన్నారు. అంతేకాక చంద్రబాబు నాయుడు, అచ్చెన్నాయుడు అర్జునుడి పాడెను మోశారు.
టీడీపీలో తీవ్ర విషాదం నెలకొంది. టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు కన్నుమూశారు. గుండెపోటుతో గత కొంతకాలంగా విజయవాడలోని రమేష్ కార్డియాక్ హాస్పటల్లో చికిత్స పొందుతున్న ఆయన.. గురువారం తుదిశ్వాస విడిచారు.
గుండెపోటుకు గురవ్వుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. శుక్రవారం ప్రముఖ నటుడు తారకరత్న గుండెపోటుకు గురైన సంగతి తెలిసిందే. ఆయన ప్రస్తుతం బెంగళూరులోని నారాయణ హృదయాలయలో చికిత్స పొందుతున్నారు. తారకరత్న పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఎక్మో ద్వారా చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సంఘటన మరువక ముందే టీడీపీకి చెందిన ఓ కీలక నేత ఒకరు గుండె పోటుకు గురయ్యారు. ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు గుండెపోటు బారిన పడ్డారు. ఆదివారం తెల్లవారు జామున […]