సాధారణంగా ఎక్కువ మంది ఓ వంద రూపాయల నోటు దొరికితే.. మరో ఆలోచన లేకుండా తీసుకుని వెళ్తుంటారు. అలానే ఓ 10 వేలు దొరికితే మరొకరి కంటపడకుండా తీసుకుని అక్కడి నుంచి జారుకుంటారు. అయితే కొందరు మాత్రం పరుల సొమ్ము పాము వంటిది అని భావిస్తారు. తమకు దొరికిన సొమ్మును నిజాయితీగా సంబంధిత వ్యక్తులకు అందజేస్తుంటారు. తాజాగా ఓ ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగి తన నిజాయితీని చాటుకున్నారు. తనకు దొరికిన రూ.5 విలువైన సొమ్మును సంబధింత వ్యక్తికి అప్పగించారు. ఈ ఘటన అన్నమయ్య జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
అన్నమయ్య జిల్లా రాజంపేటకు చెందిన సి. మాధవి.. అదే డిపోలో కండక్టర్ పనిచేస్తోంది. ఉద్యోగం విషయంలో నిబద్ధతగా ఉంటుంది. తిరుపతి-రాజంపేట బస్సుల సర్వీసులో ఆమె విధులు నిర్వహిస్తున్నారు. ఈక్రమంలో శనివారం కూడా యధావిధిగా మాధవి డ్యూటీకి వెళ్లింది. ఈ సమయంలో తిరుపతి నుంచి రాజంపేటకు వస్తుండగా కరకంబాడి వద్ద గూడూరుకు చెందిన పి. శివప్రసాద్ అనే వ్యక్తి రైల్వేకోడూరులో బస్సు ఎక్కారు. బస్సు దిగే సమయంలో తన బ్యాగును మరిచిపోయాడు. అందులో రూ.5లక్షల విలువ చేసే బంగారపు నగలు ఉన్నాయి. అయితే ప్రయాణికులకు టికెట్స్ కొట్టేందుకు వస్తున్న క్రమంలో బస్సు మధ్యలో బ్యాగ్ ను కండక్టర్ మాధవి గుర్తించింది. బ్యాగ్ ఎవరిది అంటూ బస్సులోని ప్రయాణికులను విచారించింది.
ఈలోగా బ్యాగును పొగొట్టుకున్న బాధితుడు రైల్వేకోడూరు కంట్రోల పాయింట్ లో ఫిర్యాదు చేశాడు. అతడి వద్ద ఉన్న టికెట్ ను బట్టి మాధవి విధులు నిర్వహిస్తున్న బస్సుగా గుర్తించారు. కండక్టర్ కి ఫోన్ చేస్తే, డిపో వద్దకు వస్తే బ్యాగు ఇస్తామని తెలిపారు. బ్యాగ్‌ను డిపో మేనేజరు రమణయ్యకు అందజేశారు. డీఎం చేతుల మీదుగా శివప్రసాద్ కు కండక్టర్ అప్పగించారు. మాధవిని ఎన్‌ఎంయూ డిపో అధ్యక్షుడు శివయ్య, సెక్రటరీ రమణ, ఆన్ డ్యూటీ కంట్రోల్ చలపతి అభినందించారు. మరి.. ఈఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: ఆకాశాన్నంటిన వినాయకుడి విగ్రహాల ధరలు!
ఇదీ చదవండి: ఆస్తి కోసం కన్నతల్లిపై కొడుకు దారుణం! కిడ్నాప్ చేసి మరి..