దేశంలో ఏదో ఒక చోట మహిళలపై దాడులు, హత్యలు, అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. నడి రోడ్డుపై పట్టపగలు మహిళలను కిరాతకంగా చంపేస్తున్నారు. ఇవన్నీ ఆర్థిక పరమైన లేదా వివాహేతర సంబంధాలు, కుటుంబ కలహాల కారణంగానే చోటుచేసుకుంటున్నాయి. తాజాగా
దేశంలో ఏదో ఒక చోట మహిళలపై దాడులు, హత్యలు, అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. నడి రోడ్డుపై పట్టపగలు మహిళలను కిరాతకంగా చంపేస్తున్నారు. ఇవన్నీ ఆర్థిక పరమైన లేదా వివాహేతర సంబంధాలు, కుటుంబ కలహాల కారణంగానే చోటుచేసుకుంటున్నాయి. తాజాగా అన్నమయ్య జిల్లా మదనపల్లిలో నడి రోడ్డుపై మహిళా లెక్చరర్ హత్యోందతం సంచలనం సృష్టించిన సంగతి విదితమే. ముగ్గురు వ్యక్తులు ఆమెను చంపి పరారయ్యారు. ఇప్పుడు ఈ కేసులో చిక్కుముడి వీడింది. ఆమెకు వరుసకు సోదరులయ్యే వ్యక్తులే ఈ దారుణానికి ఒడిగట్టారని పోలీసులు నిర్ధారించారు. నిందితులను అరెస్టు చేసి విచారిస్తున్నారు. అసలు ఎందుకు ఈ హత్య జరిగిందంటే..?
కుటుంబ కలహాలే లెక్చరర్ హత్యకు దారి తీశాయని ఎస్పీ గంగాధర రావు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. పట్టణంలోని శివాజీనగర్‌కు చెందిన ఎస్‌కె ఖాదర్ అహమ్మద్ కుమారుడు ఖదీర్ విద్యుత్ సంస్థలో డ్యూటీ ఆపరేటర్‌గా పని చేస్తున్నాడు. ఇతడికి 2017లో మదనపల్లె మండలం బీకే.పల్లె పంచాయతీ వైఎస్సార్ కాలనీకి చెందిన మహమ్మద్ అలీ కుమార్తె రుక్సానాతో పెళ్లి జరిగింది. ఈ విషయాన్ని దాచి.. 2022 మార్చి 29న పట్టణంలోని వెంకటేశ్వరపురానికి చెందిన గౌస్‌పీర్ కుమార్తె ఆయిషాను పెళ్లి చేసుకున్నాడు. తొలుత అతడికి పెళ్లైందన్న విషయం రెండవ భార్య ఆయిషాకు తెలిసింది. తనకు పెళ్లైన విషయం దాచి పెట్టి తనను మోసం చేసి వివాహం చేసుకున్నాండటూ ఖదీర్, రుక్సానా, అతడి కుటుంబ సభ్యులపై కేసు పెట్టింది. అయితే అతడితో విడిపోయి పుట్టింట్లో ఉంటుంది
సోదరి పుట్టింట్లో ఏడుస్తూ ఉండటాన్ని జీర్ణించుకోలేకపోయిన ఆయిషా సోదరులు షేక్‌ప్యారేజాన్, సులేమాన్.. ఖదీర్ మొదటి భార్య రుక్సానాను చంపేయాలని భావించారు. ఆమె ఓ కళాశాలలో ఇంగ్లీషు లెక్చరర్‌గా పనిచేస్తుందని తెలిసి, నిఘా ఉంచి, పలుమార్లు రెక్కీ నిర్వహించారు. ఆమె ఎటు నుండి, ఏం టైంలో వస్తుందో, వెళుతుందో తెలుసుకుని పథకం రచించారు. ప్రశాంత్ నగర్‌లోని సిద్ధార్థ కాలేజీ వీధి వెంట ఆమె వస్తుందని తెలిసి కాపు కాచారు. రుక్సానా ఆ వీధిలోకి రాగానే ఆమె కళ్లల్లో కారం చల్లి.. ఆమె మెడపైన కత్తితో పలుమార్లు క్రూరంగా పొడిచి చంపారు. వెంట తెచ్చిన ద్విచక్ర వాహనం స్టార్ట్ కాకపోవడంతో.. దాన్ని అక్కడే వదిలేసి పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు.. సీసీటీవీ ఫుటేజ్, బండి నంబర్ ఆధారంగా, సాంకేతిక సాయంతో కొన్ని గంటల్లోనే కేసును చేధించారు. అందిన సమాచారం మేరకు టమాటా మార్కెట్ వెనుక వైపున నిందితులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి కత్తులు, ఓ వాహనం, రక్తంతో రెండు చొక్కాలను స్వాధీనం చేసుకున్నారు.