ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని పథకాలను లబ్దిదారులకు చేరువయ్యేందుకు అభివృద్ధి చేసిన వ్యవస్థ వాలంటీర్. ఇది సేవతో కూడుకున్న పనని ముఖ్యమంత్రి వర్యులు జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు. వాలంటీర్లుగా సేవ చేస్తున్న వారికి గౌరవ వేతనం కింద కొంత నగదును చెల్లిస్తోంది
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని పథకాలను లబ్దిదారులకు చేరువయ్యేందుకు అభివృద్ధి చేసిన వ్యవస్థ వాలంటీర్. ఇది సేవతో కూడుకున్న పనని ముఖ్యమంత్రి వర్యులు జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు. వాలంటీర్లుగా సేవ చేస్తున్న వారికి గౌరవ వేతనం కింద కొంత నగదును చెల్లిస్తోంది ఏపీ ప్రభుత్వం. అయితే ఇటీవల కాలంలో వాలంటీర్ల వ్యవస్థపై విమర్శలు వచ్చాయి. డేటా చౌర్యానికి పాల్పడుతున్నారంటూ ఆరోపణలు వచ్చాయి. వీటితో పాటు ఇటీవల కొన్ని సంఘటనలు కూడా చోటుచేసుకున్నాయి. ప్రజా ధనంతో పరారయ్యారని ఆరోపణలు వినిపించాయి. నిన్నటికి నిన్న విశాఖలోని పెందుర్తిలో నిద్ర పోతున్న ఓ మహిళను ముఖంపై దిండు పెట్టి చంపి.. ఆపై నగలు తీసుకెళ్లాడో వాలంటీర్. ప్రస్తుతం ఈ సంఘటన ఏపీ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇటువంటి వారి వల్ల వాలంటీర్ల మొత్తానికి చెడ్డ పేరు వస్తుంది.
అయితే ఇటువంటి సమయంలో ఓ వాలంటీర్ తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా మరొకరికి ప్రాణ భిక్ష పెట్టాడు. ఇంతకు ఏం జరిగిందంటే..అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులో మొహర్రం వేడుకులను జరుపుకుంటున్నారు స్థానికులు. రైల్వే కోడూరు మండలంలోని ఓ. కొత్తపల్లిలో శనివారం రాత్రి పీర్ల చావిడి వద్ద అగ్ని గుండం ఏర్పాటు చేయగా.. కల్లూరి భాషా అనే వ్యక్తి ప్రమాదవశాత్తూ అందులో పడిపోయాడు. అందరూ చోద్యం చూస్తున్నట్లు చూశారే కానీ అతడిని కాపాడేందుకు ఎవ్వరూ ముందుకు రాలేదు. అయితే అక్కడే ఉన్న వాలంటీర్ చాపల సురేష్.. ఒక్క నిమిషం కూడా తనకేమీ అవుతుందో అని ఆలోచించలేదు.
మానవత్వం ఉన్న మనిషిగా.. అగ్నిగుండంలోకి దిగి భాషాను బయటకు తీసుకొచ్చాడు. ఈ ఘటనలో ఇద్దరికీ తీవ్ర గాయాలు అయ్యాయి. భాషా వీపు భాగం కాలిపోవడంతో తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించి.. చికిత్స అందిస్తున్నారు. వాలంటీర్కు కాళ్లు కాలడంతో చికిత్స అందించగా.. ఇంటికి చేరుకున్నాడు. తన ప్రాణాలు లెక్కచేయకుండా భాషాను కాపాడిన వాలంటీర్‌ను అభినందిస్తున్నారు స్థానికులు. శభాష్ అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ప్రస్తుతం వాలంటీర్లపై వివాదం నెలకొన్న నేపథ్యంలో ఇతడు చేసిన సాహసంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇది చదవండి: విశాఖలో దారుణం..! వృద్దురాలిని హత్య చేసిన వాలంటీర్..!