ఎన్నడూ లేని విధంగా టమాటా పంట సిరులు కురిపిస్తుంది. తనను నమ్ముకున్న అన్నదాతను లక్షాధికారిని, కోటీశ్వరుణ్ణి చేస్తుంది. మొన్నటి వరకు టమాటా రైతు కన్నీరు కార్చగా.. ఈ ఏడాది మాత్రం లాభాలను చవి చూశాడు.
ఎన్నడూ లేని విధంగా టమాటా పంట సిరులు కురిపిస్తుంది. తనను నమ్ముకున్న అన్నదాతను లక్షాధికారిని, కోటీశ్వరుణ్ణి చేస్తుంది. మొన్నటి వరకు టమాటా రైతు కన్నీరు కార్చగా.. ఈ ఏడాది మాత్రం లాభాలను చవి చూశాడు. మార్కెట్‌లో టమాటా ధర పెరగడమే దీనికి కారణం. కేజీ 25 నుండి 50 వరకు ఉండే ధర రెండు వందల రూపాయల వరకు పలకడంతో.. టమాటా దిగుబడికి డిమాండ్ పెరిగింది. ఇదే సమయంలో ఈ టమాటాల కోసం రైతులు హత్యకు గురైన సందర్భాలున్నాయి. ఆరునెలలు పాటు పండించిన పంటను దొంగలు దోచుకెళ్లిన ఘటనలు కూడా చూశాం. ఏదేమైనా మొత్తానికి టమాటా రైతు లాభపడ్డారు. అయితే ఓ రైతు మాత్రం తన మంచి మనస్సు చాటుకున్నాడు.
టమాటాకు సరైన గిట్టుబాటు ధర రానప్పుడు.. రోడ్లపై వాటిని పడేసి కన్నీరు కార్చిన రైతు.. నేడు మాత్రం నవ్వులు చిందిస్తున్నాడు. టమాటాకు గిట్టుబాటు ధర బాగా పెరగడంతో లాభాలను అనుభవిస్తున్నాడు రైతు. ఆంధ్రప్రదేశ్ లోని అన్నమయ్య జిల్లాలోని తంబళ్లపళ్లి మండలానికి చెందిన నరసింహా రెడ్డి అనే రైతు కూడా లాభాలను చవిచూశాడు. అదే సమయంలో రైతుగా తన కూలీల కష్టాన్ని గ్రహించి.. మంచి మనస్సు చాటుకున్నాడు. తనకున్న ఐదు ఎకరాల పొలంలో టమాటా సాగు చేయగా.. మార్కెట్ లో మంచి ధరలు పలకడంతో మంచి లాభాలు వచ్చాయి. ఈ సాగులో భాగస్వామ్యులైన కూలీలకు కొత్త బట్టలు పెట్టి.. ధన్యవాదాలు తెలిపాడు.