తన బిడ్డలు అంటే ప్రతి అమ్మకు ప్రాణం. కడుపులో ఉన్నప్పుడు తనని తన్నుతున్నా.. ఆ నొప్పులను హాయిగా భరిస్తుంది. పసివాడిగా ఉన్నప్పుడు ఆమె గుండెలపై తన చిట్టి పాదాలతో తన్నినా మురిసిపోతుంది. అయితే అలా పెద్దయ్యాక కూడా ఆ తల్లి కడుపుపై తంతున్నారు కొందరు పుత్రరత్నాలు. ఆ దెబ్బలు మాత్రం తట్టుకోలేక కొందరు అమ్మలు అల్లాడుతున్నారు. జీవితాంతం తమ కోసం అహర్నిశలు కష్టపడిన తల్లిని జీవిత చరమాంకంలో అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారు. నరకం నుంచి కాపాడేది దేవుడు ఎరుకు.. బ్రతికుండగానే నరకం చూపిస్తున్నారు. చివరకి ఆస్తుల కోసం తల్లిదండ్రులను చంపడానికి సైతం వెనుకాడటం లేదు కొందరు బిడ్డలు. తాజాగా ఆస్తి కోసం తల్లిని కిడ్నాప్ చేశాడు ఓ కుమారుడు. ఆమెను చిత్ర హింసలకు గురిచేశాడు. నెల్లూరు జిల్లా కావలి చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. నెల్లూరు జిల్లా కావలిలోని గాయత్రికి నగర్ కి చెందిన కోటేశ్వరరావు సీఐఎస్ఎఫ్ లో ఎఎస్ఐగా విధులు నిర్వహించి.. పదవీ విరమణ చేశాడు. ఈ క్రమంలో ఇంటి వద్దనే ఉంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈక్రమంలో కోటేశ్వరావు తన తల్లి మహాలక్ష్మిని ఆస్తి కోసం వేధిస్తుండే వాడు. రోజు రోజూకు కొడుకు కోటేశ్వరరావు వేధింపులు ఎక్కువయ్యాయి. కొడుకు తో పాటు అతడి కుటుంబ సభ్యుల వేధింపు భరించలేక తల్లి మహాలక్ష్మి పెద్ద కుమార్తె మహేశ్వరి ఇంటికి వెళ్లింది. ఏడాది కాలంగా ఆమె దగ్గరే ఉంటుూ కాలం వెళ్లదీస్తోంది. అయితే తన తల్లి మహాలక్ష్మి.. ఆమె పేరుపై ఉన్న ఆస్తిని కూతురుకు రాసిస్తుందన్న భయంతో రెండు నెలల క్రితం కన్నతల్లిపై కోటేశ్వరరావు దాడికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో అప్పుడప్పుడు ఆస్తి రాసివాలంటూ తల్లితో కోటేశ్వరావు ఘర్షణకు దిగేవాడు. ఈక్రమంలో నిన్న రాత్రి అకస్మాత్తుగా కోటేశ్వరరావు.. తన కుటుంబ సభ్యులతో కలిసి సోదరి మహేశ్వరి ఇంటిపై దాడి చేశాడు. ఈక్రమంలోనే తల్లి మహాలక్ష్మిని కిడ్నాప్ చేశాడు. అడ్డు వచ్చిన మహేశ్వరి దంపతులపై విచక్షణ రహితంగా దాడి చేసి.. మహాలక్ష్మిని తీసుకెళ్లాడు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా మహేశ్వరి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపడుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగంలో బాధ్యతయుతమైన పదవిలో విధులు నిర్వహించిన వ్యక్తి ఇలా తల్లిని కిడ్నాప్ చేయడం సంచలనంగా మారింది. ఇదీ చదవండి: భర్తకు విడాకులు, ఇద్దరి ప్రియుళ్లతో సరసాలు.. అదిరిపోయిన క్లైమాక్స్ ట్విస్ట్! ఇదీ చదవండి: భార్యపై అనుమానం.. ఇద్దరు పిల్లల్ని అడవిలోకి తీసుకెళ్లి తండ్రి దారుణం!