వృద్ధులకు, వితంతువులకు, దివ్యాంగులకు ప్రభుత్వ సాయంగా పెన్షన్లు ఇస్తున్న విషయం తెలిసిందే. వాటిపై ఆధారపడి జీవించే పేదవారు చాలా మందే ఉన్నారు. పెన్షన్ల కోసం ఎదురుచూసే ఎంతో మందికి కొత్త ఏడాదికి అందిన పెన్షన్ ఊహించని షాక్ ఇచ్చింది. ఆ వచ్చిన డబ్బులో దొంగనోట్లు రావడంతో పెన్షన్‌దారులు ఆందోళనకు గురయ్యారు. పెన్షన్ ఇచ్చిన గ్రామ వాలంటీర్‌కే మళ్లీ ఆ నగదు తిరిగి ఇచ్చే.. నిరసనకు దిగారు. ఈ ఘటన ప్రకాశం జిల్లాలోని యర్రగొండుపాలెం మండలంలో నర్సపాలెం గ్రామంలో చోటు చేసుకుంది. పెన్షన్‌దారులకు ఈ నెల పెన్షన్ ఇచ్చేందుకు గ్రామపంచాయతీ కార్యదర్శి.. శనివారం యర్రగొండపాలెం బ్యాంకులో నగదు డ్రా చేసుకుని వచ్చాడు.
ఆదివారం నర్సపాలెం పెన్షన్‌దారులకు గ్రామ వాలంటీర్ అమోసు నగదు పంపిణీ చేశారు. గ్రామంలో చాలా వరకు నగదు పంపిణీ అయిపోయిన తర్వాత.. గ్రామ వాలంటీర్ పంపిణీ పూర్తి చేసుకుని వెళ్లిపోయారు. ఆ తర్వాత.. పెన్షన్ నగదులో ఒకటీ రెండు దొంగనోట్లను అందరు పెన్షన్ దారులు గుర్తించారు. వారికి ఇచ్చిన నగదులో 500 వందల నోట్లలో ఒకటి రెండు నోట్లు తేడాగా ఉండటంతో ఆందోళన చెందారు. విషయం తెలుసుకున్న గ్రామ వాలంటీర్ అమోసు అందరి నుంచి పెన్షన్ నగదును వెనక్కితీసుకున్నారు. అయితే.. ఈ దొంగనోట్ల ఘటనపై పోలీసులకు సమాచారం అందగా.. వెళ్లి దాదాపు రూ.19 వేల విలువ చేసే దొంగనోట్లను స్వాదీనం చేసుకుని.. కేసు నమోదు చేశారు.
అయితే.. పంచాయతీ కార్యదర్శి బ్యాంక్ నుంచి నగదు డ్రా చేసుకుని తీసుకొచ్చి.. కొంత నగదును గ్రామ వాలంటీర్ అమోసుకు ఇచ్చినట్లు పేర్కొన్నారు. అయితే.. ఎక్కడాలేని సమస్య నర్సపాలెం గ్రామంలోనే ఉందని పంచాయతీ కార్యదర్శి చెబుతున్నట్లు సమాచారం. అయితే.. పెన్షన్ నగదులో దొంగనోట్లు ఎలా వచ్చేయనే విషయంపై గ్రామ వాలంటీర్ అమోసు మాత్రం ఏం సమాధానం చెప్పడంలేదని పోలీలుసు వెల్లడించారు. అయితే.. దాదాపు అందరికి ఒకటీ లేదా రెండు దొంగనోట్లు రావడంతో ఈ ఘటనపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదేదో కావాలని చేసిన పనిలా ఉందని స్థానికులు పోలీసులకు వెల్లడించారు. మరి ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.