వృద్ధులకు, వితంతువులకు, దివ్యాంగులకు ప్రభుత్వ సాయంగా పెన్షన్లు ఇస్తున్న విషయం తెలిసిందే. వాటిపై ఆధారపడి జీవించే పేదవారు చాలా మందే ఉన్నారు. పెన్షన్ల కోసం ఎదురుచూసే ఎంతో మందికి కొత్త ఏడాదికి అందిన పెన్షన్ ఊహించని షాక్ ఇచ్చింది. ఆ వచ్చిన డబ్బులో దొంగనోట్లు రావడంతో పెన్షన్‌దారులు ఆందోళనకు గురయ్యారు. పెన్షన్ ఇచ్చిన గ్రామ వాలంటీర్‌కే మళ్లీ ఆ నగదు తిరిగి ఇచ్చే.. నిరసనకు దిగారు. ఈ ఘటన ప్రకాశం జిల్లాలోని యర్రగొండుపాలెం మండలంలో నర్సపాలెం గ్రామంలో […]