ఏలూరు జిల్లా ముసునూరు మండలం అక్కిరెడ్డిగూడెం గ్రామంలోని పోరస్ కెమికల్ ఫ్యాక్టరీలో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంలో ఆరుగురు సజీవదహనం అయిన సంగతి తెలిసిందే. ఈ విషాదంతో ఒక్కసారిగా రాష్ట్రవ్యాప్తంగా ఈ పరిశ్రమ గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగతోంది. ఈ కెమికల్ ఫ్యాక్టరీ వల్ల ప్రమాదం చోటు చేసుకోవడమే కాక.. దాని నుంచి విడుదలయ్యే రసాయన వ్యర్థాల వల్ల ఆ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. ఆరేళ్ల వయసు నుంచే అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. గ్రామంలో ఒక్కరు కూడా 55 ఏళ్లకు మించి బతకడం లేదంటే.. అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలో తక్షణమే తమ గ్రామం నుంచి పరిశ్రమను తొలగించాల్సిందిగా గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: డాక్టర్ కాదు కామ పిశాచి.. 48 మంది మహిళలపై లైంగిక దాడి!
గ్రామస్తులు మాట్లాడుతూ.. ‘‘పోరస్ పరిశ్రమ వల్ల మా గ్రామం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఆరేళ్ల వయసు నుంచే పిల్లల్లో గ్యాస్ట్రిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. కిడ్నీ బాధితులు ఏటా పెరిగిపోతున్నారు. నాలుగేళ్ల క్రితం వరకు ఊరిలో డయాలసిస్ రోగులు ఎవరు లేరు. ఇప్పుడు వారి సంఖ్య ఎనిమిదికి చేరింది. చిన్న వయసులోనే మోకాళ్ల నొప్పులు వస్తున్నాయి. పిల్లల్లో ఎదుగుదల ఉండట్లేదు. మా ఊరిలో ఎవరు 55 ఏళ్లకు మించి బతకడం లేదు. కాలుష్యంతో నిత్యం ఇలా నరకం చూపించే బదులు.. ఊరందరిని ఒకేసారి చంపేయండి’’ అంటూ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: ఏలూరులో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురు మృతి!
కాలుష్యం, భద్రతాలేమితో ప్రాణాలు తీసే ఈ ఫ్యాక్టరీ మా గ్రామంలో వద్దు.. దీన్ని తక్షణమే మూసేయండి అని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాక రెండు, మూడేళ్ల క్రితం వరకు ఈ ఫ్యాక్టరీ నుంచి వచ్చే వ్యర్థ జలాలను స్థానికంగా ఉండే చెరువులోకి విడుదల చేసేవారు. కానీ ఓ రోజు ఆ చెరువులో నీళ్లు తాగి పలు మేకలు, గేదెలు మృతి చెందాయి. దాంతో గ్రామస్తులు నిరసన వ్యక్తం చేయడంతో.. వ్యర్థ జలాల్ని చెరువులోకి పంపటం ఆపేశారు. వాటిని ప్రస్తుతం భూగర్భంలోకి పంపిస్తున్నారు. దాంతో భూగర్భ జలాలు కాలుష్యం అవుతున్నాయి. రసాయనాలు కలిసిన నీరు ఎంతలా కలుషితం అవుతుందో చూపడానికి గ్రామస్తులు ఓ బోరు నుంచి వస్తున్న నీటిని.. చిన్న కుంటలో నిల్వ చేస్తున్నారు. దాని అడుగు భాగంలో చూస్తే రసాయన వ్యర్థాలతో నిండిపోయి.. మట్టి నల్లగా మారిపోయి కనిపించింది.
ఇది కూడా చదవండి: ప్రయాణికుడి సెల్‌ఫోన్‌నుంచి మంటలు.. విమానంలో కలకలంఈ పరిశ్రమ, దాని నుంచి వెలువడుతున్న కాలుష్యం గురించి 2016, 2017లోనే గ్రామస్తులు కొందరు కాలుష్య నియంత్రణ మండలికి ఫిర్యాదు చేశారు. అప్పట్లో వారు తనిఖీలు జరిపి పలు చర్యలు చేపట్టాలని ఫ్యాక్టరీ యాజమాన్యానికి సూచించారు. అయితే ఆ తర్వాత అవి అమలయ్యాయా.. లేదా అనేది పట్టించుకునేవారే కరువయ్యారు. ఫ్యాక్టరీ యాజమాన్యం.. ఇష్టారీతిన వ్యర్థాలను భూమిలోకి వదలడం.. అలా కలుషితం అయిన నీరు తాగడంతో.. గత రెండు, మూడేళ్లుగా గ్రామంలో కిడ్నీ వ్యాధి బాధితులు పెరుగుతున్నారు. ఇక ఫ్యాక్టరీ అధికారులు గ్రామంలోని కొందరితో కుమ్మక్కయ్యి.. ఎవరైనా తనిఖీలకు వచ్చినప్పుడు.. అంతా బాగానే ఉందని చెప్పించుకుంటున్నట్లు పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. బుధవారం నాటి అగ్ని ప్రమాదం సంఘటనతో.. ఫ్యాక్టరీని మూసివేస్తామని తెలిపారు. మరి ఇప్పటికైనా కఠిన చర్యలు తీసుకుంటారా.. లేదా చూడాలి అంటున్నారు గ్రామస్తులు. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.