అటవీ ప్రాంతం సమీపంలో నివసించేవారు, అడవి గుండా ప్రయాణించేవారికి అప్పుడప్పుడూ జంతువులు కనిపించడం సహజం. కొందరు అయితే వాటి దాడికి కూడా గురవుతుంటారు. అయితే అన్ని జంతువులు ఒక లెక్క.. గజరాజు మరోలెక్క. అంత సైజులో ఉన్న ఏనుగు మన వైపు చూస్తేనే గుండె ఝల్లు మంటుంది. అలాంటిది అది మనల్ని వెంబడిస్తే? పైప్రాణాలు పైనే పోతాయి. అలాంటి పరిస్థితే కొందరు బైకర్లకు ఎదురైంది.
ఇదీ చదవండి: వీడియో: పోలీసులకే వార్నింగ్ ఇచ్చిన హిజ్రాలు!
తిరుమల పాపవినాశనం రహదారిలో నాలుగు రోజులుగా తిష్ఠ వేసిన ఏనుగులు ఒక్కసారిగా రోడ్డుపైకి వచ్చాయి. అటుగా వెళ్తున్న బైకర్లను కొంతదూరం వెంబడించాయి. వాటిని ముందే గమనించిన వాళ్లు బండి వెనక్కు తిప్పుకుని వెళ్లిపోయారు. కొంతదూరం వెంబడించి ఆ రెండు ఏనుగులు అడవిలోకి వెళ్లిపోయాయి. ఏనుగుల హల్ చల్ కు ఆ మార్గంలో కొద్దిసేపు రాకపోకలు నిలిచిపోయాయి. వాటిని అడవిలోకి పంపేందుకు అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
— K I N G (@KingKalyanPK) March 31, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.