తెలుగు రాష్ట్రాల్లో గత వారం రోజులుగా వరసుగా వర్షాలు పడుతూనే ఉన్నాయి. దీంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే వర్షాల బాధతో సతమతమవుతున్న ప్రజలకు ఇప్పుడు కొత్త కష్టాలు వచ్చిపడుతున్నాయి. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లోనూ తరచూ భూప్రకంపనలు భయపెడుతూనే ఉన్నాయి. నెల్లూరులో స్వల్ప భూకంపం సంబవించింది. వివరాల్లోకి వెళ్తే..
నెల్లూరు జిల్లాలో పలు చోట్ల భూమి స్వల్పంగా కంపించింది. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఈ భూకంపం నాలుగు మండలాల్లో సంబవించింది. ఈ భూ ప్రకంపణలు అక్కడ చుట్టుపక్కల గ్రామాల్లో మూడు సెకన్ల నుంచి ఐదు సెకన్ల వరకు వచ్చినట్లు ప్రత్యేక్ష సాక్షులు తెలిపారు. భూమి కంపించడంతో ఇళ్లలోని సామాగ్రి కిందపడటం, మంచాలు కదలడంతో ఇళ్లలోని వారంతా భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
ఈ భూకంపం వల్ల ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్ట.. పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరగలేదని అధికారులు స్పష్టం చేశారు. అంతేకాదు రిక్టర్ స్కేల్ పై భూ కంప తీవ్రత ఎంత అన్నది ఇంకా స్పష్టం చేయలేదు. గతంలోనూ పలుసార్లు నెల్లూరు జిల్లాలో భూ ప్రకంపనలు సంభవించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఏపీలో వాకులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. జిల్లాల వారీగా కంట్రోల్ రూంలను ఏర్పాటు చేశారు అధికారులు.
ఇది చదవండి: వరదలపై CM జగన్ సమీక్ష. ఒక్కొక్కరి చేతికి రూ.2వేలు!