ఏ దేశంలోనైనా ప్రకృతి విపత్తులు సంబవించినప్పుడు.. ప్రపంచ దేశాలు చెయ్యి అందించాలి. అది మానవత్వం. లేదా సహాయం చేస్తున్న చేతులకైనా అండగా నిలబడాలి అది మంచితనం. ఈ రెండూ మా దేశానికి లేవని మరోసారి నిరూపించుకుంది పాకిస్థాన్. భూకంపాలతో అల్లాడిపోతున్న టర్కీ, సిరియాలకు ఆపన్న హస్తాలు అందించాల్సిందిపోయి.. సహాయం చేస్తున్న చేతులకు అడ్డుతగలాలని చూసింది. టర్కీ, సిరియా ఉన్న విపత్కర పరిస్థితుల్లో ఆ దేశాలకు సాయం అందించడానికి బయలు దేరిన భారత యుద్ధ విమానాలకు తమ గగనతలం […]
ఎటుచూసినా కన్నీళ్లు.. కాపాడండి.. కాపాడండి.. అంటూ ఆర్తనాధాలు.. హహాకారాలు, శిథిలాల కింద కుప్పలు కుప్పలు గా మృతదేహాలు. ప్రస్తుతం టర్కీ, సిరియాలో కళ్లెదుటే కనిపిస్తున్న విషాద వాతావరణం. రాకాసి భూకంపం టర్కీ, సిరియాలను అతలాకుతలం చేసింది. ఓవైపు కళ్లెదుటే ప్రాణాలు కోల్పోతున్న పసిపిల్లలు.. వారిని చూసి తల్లడిల్లిపోతున్న కన్నపేగులు. ఇలా భూకంపంతో ఎక్కడ చూసినా హృదయవిదారకమైన సంఘటనలే మనకు కనిపిస్తాయి. ఈ దృశ్యాలు అన్ని పక్కన పెడితే.. ప్రపంచమే కన్నీరు పెట్టుకునే ఓ వీడియో నెట్టింట వైరల్ […]
టర్కీ, సిరియాల్లో సంభవించిన భూకంపాలు ప్రపంచ దేశాలను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేశాయి. ప్రకృతి ప్రకోపానికి ఆ రెండు దేశాలు అల్లకల్లోలంగా మారాయి. తీవ్ర భూకంపం ధాటికి రెండు దేశాల్లో వందలాది భవనాలు పేకమేడల్లా కుప్పకూలాయి. అలాగే భారీగా ఆస్తి, ప్రాణ నష్టం జరిగినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు టర్కీ, సిరియాల్లో 2,300 మందికి పైగా మృతి చెందారని సమాచారం. టర్కీలో సంభవించిన భారీ భూకంపంలో ఓ ఫుట్‌బాలర్ చిక్కుకున్నాడు. ఘనా టీమ్ నేషనల్ ఫుట్‌బాల్ ప్లేయర్, మిడ్ […]
ఈ మద్య పలు దేశాల్లో భూకంపాలు ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. నిన్న ఇండోనేషియాలో భూకంపం సృష్టించిన బీభత్సం మరువక ముందే.. మంగళవారం ఉదయం సోలమాన్ దీవుల్లో భారీ భూకంపం సంబవించింది. రిక్టర్ స్కేల్ పై దీని తీవ్రత 7.0 గా నమోదైందని అంటున్నారు. ఈ క్రమంలో సునామీ హెచ్చిరికలు సైతం జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. మంగోలాకు 17 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం నిక్షిప్తమై ఉందని, దాదాపు 20 సెకండ్ల […]
సాధారణంగా వర్షాకాలం ప్రారంభం అయిందంటే చాలు.. చాలా చోట్ల చేపల వానలు కురిశాయి.. 5 కేజీల చేప, 10 కేజీల చేప దొరికిందన్న వార్తలు మనం తరచూ చుస్తూనే ఉంటాం. అలాగే సముద్రంలో వేటకి వెళ్లిన జాలర్లకు పలు సందర్భాల్లో వింత.. వింత చేపలు వలకు చిక్కడమూ జరిగాయి. కానీ మనం ఇప్పుడు తెలుసుకోబోయే చేప మాత్రం చాలా అరుదైనది, ప్రత్యేకమైనది. ఇంతకీ ఆ చేప ఎక్కడ చిక్కింది.. దాన్ని రాకాసి చేప అని ఎందుకంటారు.. లాంటి […]
తెలుగు రాష్ట్రాల్లో గత వారం రోజులుగా వరసుగా వర్షాలు పడుతూనే ఉన్నాయి. దీంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే వర్షాల బాధతో సతమతమవుతున్న ప్రజలకు ఇప్పుడు కొత్త కష్టాలు వచ్చిపడుతున్నాయి. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లోనూ తరచూ భూప్రకంపనలు భయపెడుతూనే ఉన్నాయి. నెల్లూరులో స్వల్ప భూకంపం సంబవించింది. వివరాల్లోకి వెళ్తే.. నెల్లూరు జిల్లాలో పలు చోట్ల భూమి స్వల్పంగా కంపించింది. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఈ భూకంపం నాలుగు మండలాల్లో సంబవించింది. ఈ భూ ప్రకంపణలు […]