వివాహ బంధంలో బీటలు వారుతున్నాయి. మనస్పర్థలు వచ్చి, మాట మాట పెరిగి భార్యా భర్తలు విడిపోతున్నారు. బిడ్డల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మరికొంత మంది విడాకులు కూడా తీసుకోవడం లేదు. తమ కాళ్లపై తాము నిలబడాలని ఆశిస్తున్నారు. ఇదే నిర్ణయం మహిళలకు శాపంగా మారుతుంది.
వివాహ బంధంలో బీటలు వారుతున్నాయి. మనస్పర్థలు వచ్చి, మాట మాట పెరిగి భార్యా భర్తలు విడిపోతున్నారు. ఇటువంటి గిల్లికజ్జాలు కామన్ అనుకుని లేదా మళ్లీ కలుస్తామన్న హోప్స్ ఉండటం వల్లో విడివిడిగా జీవిస్తున్నారు. అలాగే బిడ్డల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మరికొంత మంది విడాకులు కూడా తీసుకోవడం లేదు. విడాకులు అనగానే పెద్దలు కూడా అంత అంగీకరించడం లేదు. అలాగే తమ కాళ్ల మీద తాము నిలబడాలన్న తపన పడుతున్నారు విడిపోయిన మహిళలు. ఇదే నిర్ణయం మహిళలకు శాపంగా మారుతుంది. భర్తతో విడిగా ఉంటూ.. పిల్లలను పెంచి పోషించేందుకు కష్టపడాల్సిన పరిస్థితి. ఉద్యోగాల కోసం బయటకు వెళుతున్న మహిళలపై భర్త లేదా.. తెలిసిన వ్యక్తులు దారుణాలకు ఒడిగడుతున్నారు.
విధులు పూర్తి చేసుకుని ఇంటికి వస్తున్న మహిళలపై యాసిడ్‌తో దాడి చేశారు ఆగంతకులు. ఈ ఘటన ఏపీలోని ఏలూరు జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యడ్ల ప్రాంచీనమ్మ, ఆంజనేయులు భార్యా భర్తలు. వీరికి ఐదేళ్ల కుమార్తె స్మైలీ ఉంది. అయితే భర్తతో గొడవ కారణంగా ఏడాది క్రితం పుట్టింటికి వచ్చేసింది. ఏలూరులోని విద్యానగర్ మానిస్ట్రీ దగ్గరలో నివాసముంటుంది. భర్త ఆంజనేయులు తన తల్లిదండ్రులతో జీవిస్తున్నాడు. అయితే ప్రాంచీనమ్మ మూడు నెలల నుండి ఓ డెంటల్ క్లినిక్‍లో రిసెప్షనిస్టుగా పనిచేస్తుంది. మంగళవారం రాత్రి 9 గంటలకు డ్యూటీ పూర్తి చేసుకుని స్కూటీపై ఇంటికి వెళుతుండగా.. కాపు కాచీ మరీ.. గుర్తు తెలియని వ్యక్తులు ఇద్దరు ఆమె వాహనాన్ని అడ్డుకున్నారు.
వెంటనే ప్రాంచీనమ్మపై యాసిడ్‌తో దాడి చేసి అక్కడి నుండి పరారయ్యారు. కేకలు వేసుకుంటూ ఇంటికి వెళ్లి పడిపోయింది. ఆమె చెల్లి యడ్ల సౌజన్య, కుటుంబ సభ్యులు వెంటనే ఆమెపై నీళ్లు పోసి కాలిపోయిన దుస్తులను మార్చి మరో స్కూటర్‌పై ఏలూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. వెంటనే మెరుగైన వైద్యం కోసం విజయవాడ ఆసుపత్రికి తరలించారు. ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఆమె పరిస్థితి తీవ్రంగా ఉందని ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి. ఆమె చూపు కోల్పోయినట్లు వైద్యులు గుర్తించారు. ఆస్పత్రిలో బాధితురాలిని డీఐజీ అశోక్‌కుమార్, ఎస్పీ మేరీ ప్రశాంతి, ఏఎస్పీ వివరాలు అడిగి తెలుసుకున్నారు. డీఎస్పీ, నగరంలోని సీఐలు, ఎస్‌ఐలు ఆస్పత్రికి వద్దకు చేరుకున్నారు. అనంతరం బాధితురాలి ఇంటి సమీపంలోని సంఘటనా స్థలిని పరిశీలించారు. కుటుంబ సభ్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. భర్త, ఇతరులపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.