ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్‌కు కోర్టు సమన్లు జారీ చేసింది. నాంపల్లి కోర్టుకు హాజరు కావాలంటూ సమన్లు జారీ చేశారు. హైదరాబాద్ లోని ప్రజా ప్రతినిధుల కోర్టు ఈ సమన్లను పంపింది. 2014లో హుజుర్‌నగర్ ఎన్నికల్లో కోడ్ ఉల్లంఘించారంటూ వైఎస్ జగన్, శ్రీకాంత్‌రెడ్డి, నాగిరెడ్డిలపై ఎన్నికల సమయంలో కేసు నమోదైంది. ఆ కేసులో భాగంగానే ఎంపీ, ఎమ్మెల్యే ప్రజాప్రతినిధుల కోర్టు సమన్లు జారీ చేసింది. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి ప్రజా ప్రతినిధుల కోర్టు సమన్లు జారీ చేయడం ఇదే ప్రథమం. సీఎంకు సమన్లు జారీ చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.