జంగారెడ్డిగూడెంలో మరణాలపై టీడీపీ తప్పుడు ప్రచారాలు చేస్తున్నట్లు సీఎం జగన్ మండి పడ్డారు. చంద్రబాబు హయాంలో ఏపీలో కొత్తగా 254 మద్యం బ్రాండ్లు తీసుకొచ్చినట్లు జగన్ తెలిపారు. టీడీపీ ప్రభుత్వమే ఎన్నో మద్యం బ్రాండ్లకు అనుమతి ఇచ్చిందన్నారు. ప్రెసిడెంట్ మెడల్, పవర్ స్టార్ 999, గవర్నర్ ఛాయిస్, భూంభూం బీర్ వంటివి చంద్రబాబు బ్రాండ్లని.. వాటిని తమ బ్రాండ్లుగా ప్రచారాలు చేస్తున్నట్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: ఆ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే రాజకీయాలకు గుడ్ బై
‘చంద్రబాబు ఇంటిపేరు నారా బదులు.. సారా అని పెట్టుకోవాలి. అదే కరెక్ట్ గా సూట్ అవుతుంది. టీడీపీ నేతలవి క్రిమినల్ బ్రెయిన్స్. వాళ్లందరినీ జూలో పెట్టాలి. రాష్ట్రంలో చీప్ లిక్కర్ లేదు. రాష్ట్ర ప్రభుత్వమే ప్రాసెస్డ్, డిస్టిల్డ్ లిక్కర్ అమ్ముతోంది’ అంటూ సీఎం జగన్ తెలిపారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత 43 వేల మద్యం బెల్ట్ షాపులు తొలగించామన్నారు. 4,380 వైన్ షాపుల పర్మిషన్లు కూడా రద్దు చేసి.. సంఖ్య 2,934 షాపులకు తగ్గించామన్నారు. రాష్ట్రంలో మద్యం వాడకం తగ్గించాలనే తాపత్రయంతోనే ధరలు పెంచామని.. తర్వాత రేట్లు తగ్గించి నియంత్రణతో అందుబాటులోకి తీసుకొచ్చాం. తమ బ్రాండ్లు మాత్రం దిశ, అమ్మఒడి అంటూ సీఎం చెప్పుకొచ్చారు. ఇప్పటివరకు కోటీ 16 లక్షల మంది దిశ యాప్ ను డౌన్‌లోడ్ చేసుకున్నారు. అమ్మఒడి ద్వారా 13,023 కోట్లు అందించామన్నారు. ఈబీసీ నేస్తం కింద రూ.589 కోట్లు లబ్ధిదారులకు అందజేశామన్నారు. సీఎం జగన్ వ్యాఖ్యలమై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.