ఇటీవల భారత దేశంలో పలు చోట్ల భూకంపాలు భయాందోళన సృష్టిస్తున్నాయి. ఈ నెల 9న నేపాల్ లో వచ్చిన భూకంపం ఢిల్లీ, ఉత్తరాఖాండ్ మరికొన్ని రాష్ట్రాల్లో తీవ్ర ప్రభావాన్ని చూపించింది. ఇదే నెలలో వరుసగా ఉత్తరాదిన భూకంపాలు సంబవించాయి. ఢీల్లీలో అయితే 5 సెకండ్ల పాటు భూమి కంపించింది.. అలాగే పంజాబ్ లోని అమృత్ సర్ ప్రాంతంలో సోమవారం భూమి కంపించింది.. రిక్టర్ స్కేల్ పై 4.1 గా నమోదు అయ్యింది. ఇలా వరుస భూకంపాలతో జనాలు భయంతో వణికిపోతున్నారు.
ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా లో భూ ప్రకంపణలు భయాందోళన సృష్టించాయి. పలమనేరు ప్రాంతంలో దాదాపు పది సెకన్ల పాటు భూమి స్వల్పంగా కంపించినట్లు చెబుతున్నారు. ముఖ్యంగా గంటఊరు మండంలో పలు గ్రామాల్లో వచ్చిన భూకంపానికి జనాలు భయంతో బయటకు పరుగులు తీశారు. ఒక్కసారిగా పెద్ద శబ్ధంతో భూమి కంపించడంతో ఏదో అనర్థం జరుగుతుందని ఆందోళనతో ఇళ్లు వదిలి బయట వీధుల్లోకి వచ్చిన జనాలు బిక్కు బిక్కుమంటూ గడిపారు. 15 నిమిషాల వ్యవధిలోనే మూడు సార్లు భూమి కంపించిందని స్థానికులు అంటున్నారు.
ఈ భూకంప ప్రభావంతో ఇళ్లల్లో ఉన్న వస్తువులు కింద పడిపోయాయి.. పలు చోట్ల గోడలు బీటలు వారాయి.. కానీ ప్రాణ నష్టం ఎక్కడా జరగలేదని అధికారులు అంటున్నారు. కాగా, గతంలో కూడా ఈ ప్రాంతాల్లో పలు చోట్ల భూకంపం కారణంగా ఇళ్లకు పగుళ్లు ఏర్పడ్డాయని అంటున్నారు. కొంతమేర ఆస్తి నష్టం వాటిల్లిందని అంటున్నారు.. కాకోతే ఈసారి మాత్రం ఎలాంటి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు.