తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు వస్తుంటారు. ఇక శ్రీవారి ఆలయానికి వచ్చే విరాళల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నిత్యం ఎందరో భక్తులు.. స్వామి వారికి ధనం, బంగారం విరాళంగా ఇస్తారు. తాజాగా ఓ భక్తురాలు తిరుమల శ్రీవారికి భారీ విరాళం ఇచ్చారు. టీటీడీకి 9 కోట్ల 20 లక్షల భారీ విరాళాన్ని అందించారు. చెన్నైలోని మైలాపూర్కు చెందిన రేవతి విశ్వనాథం అనే మహిళ.. ఆమె సోదరి డాక్టర్ పర్వతం కన్నుమూయడంతో ఆమె జ్ఞాపకార్థం సోదరి ఆస్తిని టీటీడీకి విరాళంగా ఇచ్చారు.
ఇందులో రూ. 3 కోట్ల 20 లక్షల రూపాయల నగదు కాగా.. రూ. 6 కోట్లు రూపాయల విలువైన రెండు ఇళ్లు ఉన్నాయి. ఈ మొత్తం విరాళాన్ని శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలోని టీటీడీ బోర్డ్ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి రేవతి విశ్వనాథం అందచేశారు. భక్తురాలు ఇచ్చిన విరాళంలో రూ. 3 కోట్ల 20 లక్షల నగదును చిన్న పిల్లల ఆసుపత్రికి వినియోగించనున్నారు. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.