నారా చంద్రబాబు నాయుడు బర్త్‌డే సందర్బంగా ఆయన కుమారుడు లోకేష్ చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరలవుతోంది. మీ రెండు కోరికలు తీరాలి నాన్న అంటూ లోకేష్ చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది. ఆ వివరాలు..
తెలుగుదేశం అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు పుట్టిన రోజు నేడు. పలువురు రాజకీయ నాయకులు, తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు చంద్రబాబుకు బర్త్‌డే విషెస్ తెలుపుతున్నారు. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కూడా ట్విట్టర్ వేదికగా చంద్రబాబు నాయుడుకి బర్త్‌డే శుభాకాంక్షలు తెలిపారు. ఇక చంద్రబాబు నాయడు కుమారుడు, తెలుగుదేశం యువ నేత నారా లోకేష్ తండ్రికి ట్విట్టర్ వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు. మీ రెండు కోరికలు నెరవేరాలి నాన్న.. అంటూ నారా లోకేష్ చేసిన ట్వీట్ ప్రస్తుతం నెట్టింట వైరలవుతోంది. మరి ఇంతకు నారా లోకేష్ రెండు కోరికలు ఏవి అంటే..
తండ్రి చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా నారా లోకేష్.. ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలుపుతూ.. మీ రెండు కోరికలు నెరవేరాలి నాన్న అంటూ ట్వీట్ చేశాడు. ఇక చంద్రబాబు కోరికలు ఏవి అంటే.. తెలుగు ప్రజలకు పేదరికం లేని సమాజాన్ని అందించాలి, అంతేకాక ఆర్థిక అసమానతలు లేని సమాజాన్ని సృష్టించాలి.. అలానే ప్రపంచంలో తెలుగు జాతిని అగ్రగామిగా నిలపాలి అని కోరుకున్నారు. మీ ఈ రెండు కోరికలు నెరవేరాలి నాన్న అంటూ లోకేష్ చేసిన ట్వీట్ వైరలవుతోంది. లోకేష్ షేర్ చేసిన వీడియోలో చంద్రబాబు మాట్లాడుతూ.. ‘నా జీవితంలో రెండు కోరికలు ఉన్నాయి. పేదరికం లేని సమాజం.. అది ఎన్టీఆర్ సిద్ధాంతం. రాష్ట్రంలోని ప్రతి ఒక్క కుటుంబాన్ని ధనవంతులుగా చేసి.. మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించేలా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. రెండోది ప్రపంచంలో తెలుగుజాతి అగ్రజాతిగా అందరికంటే ముందంజలో ఉండాలి’’ అని కోరుకున్నాడు చంద్రబాబు.
ప్రస్తుతం చంద్రబాబు ప్రకాశం జిల్లాలో ఉన్నారు. అక్కడే పార్టీ నేతల మధ్య తన పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా సర్వమత ప్రార్థనలు నిర్వహించారు.. అనంతరం వేద పండితులు, ముస్లిం మత పెద్దలు, పాస్టర్లు చంద్రబాబును ఆశీర్వదించారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు చంద్రబాబు పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. అంతేకాక ట్విట్టర్‌లో #HBDTeluguPrideBabu పేరుతో ట్విట్టర్లో ఓ హ్యాష్ ట్యాగ్ కూడా బాగా వైరల్ అవుతోంది.
I know how passionate you are to transform the lives of Telugu people and leave an everlasting legacy. May all your wishes come true Nana! Happy Birthday!#HBDTeluguPrideBabu pic.twitter.com/3fWPFWFTsy
— Lokesh Nara (@naralokesh) April 20, 2023