మృత్యువు ఎప్పుడు ఎవరిని పలకరిస్తుందో చెప్పడం కష్టం. కన్ను తెరిస్తే జననం.. కన్ను మూస్తే మరణం.. అంతే. అయితే కొందరు మరణించిన తీరు చూస్తే.. వామ్మో ఇలా కూడా జరుగుతుందా అనిపించక మానదు. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలు..
చావు పుట్టుకలు మన చేతుల్లో లేవు అంటారు. ఉన్నంత కాలం ఉంటాం.. పైవాడి పిలుపు రాగానే.. ఇక్కడి బంధాలను తెంచుకుని వెళ్లిపోతాం. ఇక ఈ మధ్య కాలంలో ఉన్నట్లుండి గుండెపోటుతో మృతి చెందుతున్న వారి సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ప్రతి రోజు.. ఎక్కడో ఒక చోట ఈ తరహా మరణాలు వెలుగు చూస్తున్నాయి. అప్పటి వరకు ఎంతో సంతోషంగా కనిపించిన వారు.. సెకన్ల వ్యవధిలో కుప్పకూలి మృత్యువాత పడుతున్నారు. ఇక తాజాగా మరో విచిత్రమైన విషాదకర సంఘటన వెలుగులోకి వచ్చింది. దగ్గరి బంధువు ఆంత్యక్రియలకు హాజరై వస్తోన్న ఆ మహిళ.. అనూహ్య రీతిలో మృత్యువాత పడింది. ఆమె మరణించి తీరు చూసి ఇలా కూడా మృతి చెందుతారా అనిపించకమానదు. ఈ విషాదకర సంఘటన వివరాలు..
ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్లో వెలుగు చూసింది. వైఎస్సాఆర్ జిల్లా ప్రొద్దుటూరు మోడెంపల్లెకు చెందిన తుపాకుల సుబ్బమ్మ (53) అనే మహిళ బంధువుల అంత్యక్రియలకు హాజరై వస్తూ.. తాను మృతి చెందింది. సుబ్బమ్మ.. బద్వేలు కుమ్మరి కొట్టాలలో నివాసం ఉంటున్న తమ సమీప బంధువు మృతి చెందటంతో.. చివరి చూపు చూసేందుకు గాను తన కుటుంబ సభ్యులతో కలిసి ఆటోలో బయల్దేరింది. బంధువు అంత్యక్రియల అనంతరం వారు అదే ఆటోలో తిరుగు ప్రయాణమయ్యారు. తొట్టిగారిపల్లె పెట్రోల్ బంకు వద్దకు రాగానే.. సుబ్బమ్మ చీర కొంగు ఎదురుగా వస్తున్న ఓ లారీకి చిక్కుకుంది.
అది గమనించి చీర కొంగును లాక్కుందా అనుకునేలోపే.. లారీ వేగంగా ముందుకు కదలడంతో.. సుబ్బమ్మ కింద పడిపోయింది. కొద్ది దూరం వరకు సుబ్బమ్మను లారీ లాక్కెళ్లడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనలో సుబ్బమ్మతో పాటు ఆటోలో ప్రయాణిస్తున్న మరో ప్రయాణికుడు షేక్ షబ్బీర్ కూడా కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. సుబ్బమ్మతో పాటు ఆటోలో ఉన్న మరో నలుగురు మాత్రం సురక్షితంగా బయటపడ్డారు.
విషయం తెలుసుకున్న పోలీసులు.. ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు నమోదు చేసుకున్నారు. లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. సుబ్బమ్మ మృతితో ఆమె కుటుంబంలో విషాదం అలుముకుంది. చీర కొంగే ఆమె పాలిట యమపాశమవుతుందని ఊహించలేకపోయామని బంధువులు కన్నీరు పెట్టుకుంటున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.