విశాఖపట్నంలో రేపటి నుంచి గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఏపీ మంత్రి రోజా చేసిన ఓ ట్వీట్ వైరల్‌గా మారింది. ఇంతకీ ఆమె ఏమన్నారంటే..!
విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ జరగనున్న సంగతి తెలిసిందే. రేపటి నుంచి ప్రారంభం కానున్న ఈ సదస్సు నిర్వహణను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కేంద్ర మంత్రలతో పాటుగా 26 దేశాల నుంచి ప్రతినిధులు ఈ సమ్మిట్‌లో హాజరుకానున్నారు. ఇప్పటికే ప్రభుత్వం వారి ఆతిథ్యానికి సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేసింది. ఈ సదస్సు ద్వారా దాదాపు రెండు లక్షల కోట్ల మేర పెట్టుబడులను ఆహ్వానించాలని ఏపీ ప్రభుత్వం టార్గెట్‌గా పెట్టుకుంది. ఈ సదస్సుపై అందరిలోనూ మంచి ఆసక్తి కనిపిస్తోంది. అలాంటి ఈ సమయంలో ప్రతిష్టాత్మక సదస్సు నిర్వహణ వేళ మంత్రి రోజా సోషల్ మీడియాలో వేదికగా చేసిన ఓ ట్వీట్ వైరల్ అవుతోంది. పక్క రాష్ట్రాలకు ధీటుగా వైజాగ్‌ను తీర్చిదిద్దుతామని మంత్రి రోజా అన్నారు.
‘ఢిల్లీ వాడు వెక్కిరించినా.. మద్రాస్ వాడు వెళ్లగొట్టినా.. హైదరాబాద్ వాడు గెంటేసినా.. మా కాళ్ల మీద మేం నిలబడుతున్నాం. పక్క రాష్ట్రాల రాజధానులకు ధీటుగా మా వైజాగ్‌ను తీర్చిదిద్దుతాం. నిజమైన ఆంధ్రోడు’ అని రోజా ట్వీట్ చేశారు. అందరికీ వైజాగ్ స్వాగతం చెబుతోందని రోజా పేర్కొన్నారు. ఈ ట్వీట్‌కు ఓ వీడియోను జత చేశారు. అందులో అడ్వాంటేజ్ ఏపీ పేరుతో సదస్సు వేళ ఏపీ సర్కారు సాధించిన విజయాలను వివరించారు. అలాగే రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాలను అందులో వెల్లడించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఏపీ ఫస్ట్ ప్లేసులో నిలవడం.. 11.43 శాతంతో డబుల్ డిజిట్ గ్రోత్ సాధించడం లాంటి అంశాలను వివరించారు. ఈ ట్వీట్ ద్వారా ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని వైజాగ్ అని ఆమె మరోసారి చెప్పకనే చెప్పారు. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి.. రోజా ట్వీట్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఢిల్లీ వాడు వెక్కిరించినా
మద్రాస్ వాడు వెళ్లగొట్టినా
హైదరాబాద్ వాడు గెంటేసినా
మా కాళ్ళ మీద మేము నిలబడుతున్నాం…
పక్క రాష్ట్రాల రాజధానులకు ధీటుగా మా వైజాగ్ ను తీర్చి దిద్దుతాం
– నిజమైన ఆంధ్రోడు 💪
VIZAG WELCOMES YOU 💐#YSJaganMarkGovernance#AdvantageAP #APGIS2023 pic.twitter.com/Br24qIafHc
— Roja Selvamani (@RojaSelvamaniRK) March 2, 2023