దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. ప్రముఖులు, సామాన్యులు అనే తేడా లేకుండా.. ప్రతి ఒక్కరిని పలకరిస్తోంది. తాజాగా ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్ మంత్రి పేర్ని నాని చేరారు. ఆయనకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు తెలిసింది. ఈ విషయాన్ని స్వయంగా మంత్రి పేర్ని నాని తన సోషల్ మీడియాలో తెలిపారు. ‘‘కొద్దిగా అనారోగ్యంగా ఉండటంతో కరోనా పరీక్షలు చేయించుకున్నాను. నాకు పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం నేను హోం ఐసోలేషన్ లో ఉన్నాను. ఈ మధ్య కాలంలో నన్ను కలిసిన వారంతా టెస్ట్ లు చేయించుకోవ్సాలిందిగా కోరుతున్నాను’’ అని సూచించారు.
ఈ క్రమంలో నేడు ఉద్యోగ సంఘాలతో చర్చలకు పేర్ని నాని హాజరు కాలేరు. కాగా ఈ మధ్య కాలంలో మంత్రి కొడాని నాని, ఎమ్మెల్యే అంబటి రాంబాబు, చంద్రబాబు, లోకేష్ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే.