అన్నదాతలను ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ పథకాల ద్వారా ఆర్థిక సాయం అందిస్తోన్న సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో పెట్టుబడి సాయం అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఓ శుభవార్త చెప్పింది. నేడు రైతుల ఖాతాల్లో డబ్బులను జమ చేయనున్నారు.
అన్నదాతలను ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు రకాల పథకాల ద్వారా ఆర్థిక సాయం అందిస్తోన్న సంగతి తెలిసిందే. అలానే రెండు తెలుగు రాష్ట్రాల్లో పెట్టుబడి సాయం అందిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇలాంటి ఓ పథకం కింద రైతులకు ఆర్థిక సాయం చేస్తోన్న సంగతి తెలిసిందే. వైఎస్సార్ రైతు భరోసా కింద రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఆర్థిక సాయం చేస్తోంది. ఇప్పటి వరకు వరుసగా పలు విడతల్లో రైతులకు ఆర్థిక సాయం చేసింది. ఈ క్రమంలోనే తాజాగా రైతులకు మరోసారి శుభవార్త చెప్పింది ఏపీ ప్రభుత్వం. నేడు నాలుగో ఏడాది మూడో విడత డబ్బులను విడుదల చేయనున్నారు.
ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రైతులను ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రవేశపెట్టిన పథకం వైఎస్సార్ రైతు భరోసా, పీఎం కీసాన్ పథకం. ఈ పథకం కింద ప్రతి ఏటా మూడు విడతలో 13,500 జమ చేయనున్నారు. తాజాగా వైఎస్సార్ రైతు భరోసా పథకం కింద నేడు 51.12 లక్షల మందికి రైతుల అకౌంట్లలో రూ.2 వేల చొప్పున సీఎం జగన్ జమ చేయనున్నారు. మొత్తం రూ.1,090 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. అలాగే 2022 డిసెంబర్ లో మాండోస్ తుపాన్ ప్రభావంతో నష్టపోయిన 91, 237 మంది రైతుల ఖాతాల్లో రూ.76.99 కోట్లను జమ చేస్తారు.
కాగా రైతు భరోసాలో భాగంగా ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే రెండు విడతల్లో రూ.11,500లను రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు ప్రభుత్వం వెల్లడిచింది. నాలుగో ఏడాది మూడో విడతలో భాగంగా వైఎస్సార్ రైతుభరోసా-పీఎం కిసాన్ నిధులను గుంటూరు జిల్లాలో తెనాలి లో విడుదల చేయనున్నారు. తెనాలిలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభా వేదికపై నుంచి బటన్ నొక్కి రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్నారు. మరి.. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.