ఏపీలో వరుసగా నాలుగో ఏడాది వైఎస్సార్ రైతు భరోసా నిధులను ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లోకి విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రతి పక్షనేత చంద్రబాబు నాయుడిపై తీవ్ర స్థాయిలో విరుచక పడ్డారు.
అన్నదాతలను ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ పథకాల ద్వారా ఆర్థిక సాయం అందిస్తోన్న సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో పెట్టుబడి సాయం అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఓ శుభవార్త చెప్పింది. నేడు రైతుల ఖాతాల్లో డబ్బులను జమ చేయనున్నారు.
రైతన్నలను ఆదుకునే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన మహోన్నత కార్యక్రమం వైఎస్సార్ రైతు భరోసా. ఈ పథకం ద్వారా.. ఏటా రైతులకు మూడు విడతల్లో.. 13,500 రూపాయల సాయాన్ని అందజేస్తున్నారు. ఈ మొత్తాన్ని రైతుల ఖాతాలో నేరుగా జమ చేస్తున్నారు. ఈ క్రమంలో నాలుగో ఏడాది రెండో విడత రైతు భరోసా నిధులను సోమవారం విడుదల చేశారు సీఎం జగన్. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో నిర్వహించిన వైఎస్సార్ రైతు భరోసా నిధులు విడుదల కార్యక్రమంలో […]
దుక్కి దున్నే రైతన్న సంతోషంగా ఉంటేనే దేశం అభివృద్ధి చెందుతుంది. సమాజంలోని బడుగు బలహీన వర్గాలు వారు ఆర్థికంగా అభివృద్ధి చెందితే.. దేశం బాగుపడుతుంది. ఈ విషయాన్ని బలంగా నమ్మడమే కాక.. ఆచరించి మరి చూపిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. రాష్ట్ర ప్రజలందరికి లబ్ధి చేకూరేలా వినూత్న సంక్షేమ పథకాలను ప్రవేశ పెడుతున్నారు. అన్నదాతలు, బడుగు, బలహీన వర్గాల వారు అభివృద్ధి చెందడం కోసం ఆర్థిక సాయం అందచేస్తున్నారు. దీనిలో భాగంగానే రైతన్నలను ఆదుకోవడం కోసం […]
ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి పదవీ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వైఎస్ జగన్ ఎన్నో వినూత్న పథకాలతో ముందుకు సాగుతున్నారు. పాదయాత్ర సందర్భంగా తాను ఇచ్చిన హామీలు నెరవేర్చుతూ ప్రజల మన్ననలు పొందుతున్నారు. రైతే దేశానికి వెన్నుముఖ అన్నట్టు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రైతులకు అండగా నిలుస్తున్నామని సీఎం జగన్ అన్నారు. సీఎం జగన్ గణపవరంలో జరుగుతున్న వైఎస్సార్ రైతు భరోసా నిధులు విడుదల కార్యక్రమంలో పాల్గొన్నారు. తమ ప్రభుత్వం రైతు అభివృద్ది కోసం అహర్శిశలూ […]