ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి పదవీ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వైఎస్ జగన్ ఎన్నో వినూత్న పథకాలతో ముందుకు సాగుతున్నారు. పాదయాత్ర సందర్భంగా తాను ఇచ్చిన హామీలు నెరవేర్చుతూ ప్రజల మన్ననలు పొందుతున్నారు. రైతే దేశానికి వెన్నుముఖ అన్నట్టు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రైతులకు అండగా నిలుస్తున్నామని సీఎం జగన్ అన్నారు. సీఎం జగన్ గణపవరంలో జరుగుతున్న వైఎస్సార్ రైతు భరోసా నిధులు విడుదల కార్యక్రమంలో పాల్గొన్నారు. తమ ప్రభుత్వం రైతు అభివృద్ది కోసం అహర్శిశలూ కష్టపడుతుందని.. వారి సంక్షేమం కోసం ఎన్నో పథకాలు తీసుకు వస్తున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఖరీఫ్ పనులు పూర్తి కాకముందే రైతుల ఖాతాల్లోకి రూ.5,500 నగదు జమ చేస్తున్నట్లు పేర్కొన్నారు. రైతు ఖాతాలో ప్రతి సంవత్సరం డబ్బులు జమ చేస్తున్నామని.. రైతు భరోసా కింద తమ ప్రభుత్వం వెచ్చిన డబ్బు రూ. 23,875 కోట్ల అన్నారు. అంతేకాదు తమ ప్రభుత్వం పరిపాలన చేపట్టిన తర్వాత అన్నదాతలకు రూ.1,10093 కోట్లు ఇచ్చామన్నారు. రైతు కష్టం గురించి తెలిసినవాడిని.. అందుకే వారి బాగు కోసం ఇదంతా చేస్తున్నా అన్నారు.
ఒకవేళ దురదృష్ట వశాత్తు రైతు ఆత్మహత్య చేసుకుంటే.. వారి కుటుంబాలకు రూ.7లక్షల చొప్పున ఆర్ధిక సాయం అందిస్తున్నామన్నారు. గత ప్రభుత్వం రైతులకు ఇచ్చిందేమీ లేదని.. తమ ప్రభుత్వం మాత్రం సకాలంలో వారికి అండగా ఉంటూ నేరుగా ఆర్ధిక సాయం చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వానికి – మన ప్రభుత్వానికి మధ్య ఉన్న తేడాను గమనించాలని సీఎం విజ్ఞప్తి చేశారు. వైఎస్సార్సిపి రైతులకు అండగా ఉంటుందని, ప్రతి అడుగులోనూ తోడుగా ఉంటుందని చెప్పారు. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.