ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి నిధులు కేటాయించాలి ఎప్పుడు కేంద్రాని కోరుతున్నట్లు అధికార పార్టీ ప్రజాప్రతినిధులు అంటారు. తాజాగా ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సైతం అలాంటి వ్యాఖ్యలే చేశారు. పోలవరం ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కోసం కేంద్రంతో యుద్ధం చేస్తున్నామని జగన్ తెలిపారు. పోలవరంలో పూర్తిస్థాయి నీటిమట్టం వరకు ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ కావాలంటే.. మరో రూ.20 వేలు కోట్లు కావాలని వెల్లడించారు. గోదావరి పరివాహక ప్రాంతంవలో వరద బాధితులను పరామర్శించే క్రమంలో సీఎం జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
వరద ప్రభావిత ప్రాంతాల పర్యటనలో భాగంగా అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరులో సీఎం మాట్లాడారు. పోలవరం ఆర్ అండ్ ఆర్ నిధుల కోసం కేంద్రంతో యుద్ధాలు, పోరాటుల చేస్తూనే ఉన్నాం. మరొక వైపు బతిమిలాడుతూనే ఉన్నాం. ప్రాజెక్టకు రాష్ట్రం తరపున రూ.20 వేల కోట్ల ఖర్చు అయింది. ఈ మొత్తం కేంద్రం నుంచి రావాలి. ఈ నిధుల విడుదల కోసం తరచూ కేంద్రానికి లేఖలు పంపిస్తున్నామని చెప్పారు. సెప్టెంబర్ లోపు పోలవరం నిర్వాసితులకు పరిహారం అందిస్తామని సీఎం స్పష్టం చేశారు. నిర్వాసితులకు పరిహారం ఇచ్చాకే పోలవరం ప్రాజెక్ట్ ను నీటితో నింపుతామని.. ఏ ఒక్కరికి అన్యాయం జరగనీయబోమని సీఎం చెప్పారు.
ఒకేసారి నీరు నింపితే ప్రాజెక్ట్ ప్రమాదం ఉంటుందని.. డ్యామ్ ను పూర్తిగా నింపడానికి కేంద్ర జలసంఘం ఒప్పుకోదని వెల్లడించారు. మొదట డ్యామ్‌లో సగం వరకు నీరు నింపుతామని.. ఆ తర్వాత మూడేళ్లలో పూర్తిగా నింపుతామని పేర్కొన్నారు. రూ. వెయ్యి, 2 వేల కోట్లు అయితే ఇంత ఆలోచించేవాణ్ని కాదని.. రూ.20 వేల కోట్లు అయినందున కేంద్రం సాయం కావాల్సిందేనని స్పష్టం చేశారు. మరి.. సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలిజేయండి.