జగన్ సర్కార్ తీసుకున్న చాలా గొప్ప నిర్ణయాల్లో సచివాలయ వ్యవస్థ ఒకటి. ప్రభుత్వ పథకాలను నేరుగా లబ్ధిదారుల ఇంటికే తీసుకువచ్చే వ్యవస్థగా నిలిచింది. ఈ క్రమంలో సచివాలయ వ్యవస్థకు సంబంధించి జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకోనుంది. ఆ వివరాలు..
ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తీసుకున్న కీలక నిర్ణయాల్లో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ఒకటి. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేయడం.. ప్రభుత్వ పథకాలను నేరుగా లబ్ధిదారులకు అందించడం కోసం తీసుకువచ్చిన సచివాలయ వ్యవస్థ మంచి ఫలితాలను ఇచ్చింది. నేడు పెన్షన్ మొదలు.. ఏవైనా సర్టిఫికెట్లు వరకు.. ఇలా ప్రభుత్వ కార్యలయాల్లో ఎలాంటి పనులు కావాలన్నా సరే.. వెంటనే అయిపోతున్నాయి. ఈ క్రమంలో ప్రజలు సచివాలయ వ్యవస్థ మీద ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ క్రమంలో జగన్ సర్కార్ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు శుభవార్త చెప్పనుంది. నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో సచివాలయ వ్యవస్థకు సంబంధించి.. జగన్ సర్కార్ కీలక బిల్లును ప్రవేశపెట్టేందుకు రెడీ అవుతోంది. ఆ వివరాలు..
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా జగన్ సర్కార్ సచివాలయ ఉద్యోగులకు శుభవార్త చెప్పేందుకు రెడీ అవుతోంది. సచివాలయ వ్యవస్థకు పూర్తిస్థాయి చట్టబద్ధత కల్పించేందుకు సంబంధించిన బిల్లును ప్రభుత్వం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టనుంది. 2022 డిసెంబర్‌లో జారీచేసిన ఆర్డినెన్స్ స్థానంలో అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి.. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థకు పూర్తి స్థాయిలో చట్టబద్ధతను కల్పించనుంది జగన్ సర్కార్. ఈ బిల్లును నేడు అనగా మంగళవారం జరిగే కేబినెట్ సమావేశంలో ఆమోదించనున్నారు. బిల్లుకు ఆమోదం తెలిపితే.. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఎంతో మేలు జరగనుంది.
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. గాంధీ జయంతి రోజున అనగా.. 2019 అక్టోబరు 2న జగన్ సర్కార్ సచివాలయ వ్యవస్థకు శ్రీకారం చూడుతూ నిర్ణయం తీసుకుంది. మూడేళ్ల క్రితం గాంధీ జయంతి నాడు ఏపీలో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ఏర్పాటైన సంగతి తెలిసిందే. ఈ సచివాలయాల్లో పనిచేసేందుకు 1.34 లక్షల శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలకు గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇచ్చి.. వెంటనే ఉద్యోగాలను భర్తీ చేసింది. కేవలం నాలుగు నెలల వ్యవధిలోనే ఈ ఉద్యోగ ప్రక్రియ పూర్తయ్యింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి రెండువేల జనాభాకు ఒక సచివాలయం చొప్పున ఏపీ వ్యాప్తంగా 15,004 గ్రామ, వార్డు సచివాలయాలు వెలిసాయి. మరి జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.